BREAKING
తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన కానూరు, పోరంకిలో వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ విస్తృత ప్రచారం తొర్రూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి అన్నారంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు - శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో కన్నులపండువగా దీపోత్సవం, తులసి కళ్యాణం అయ్యప్ప స్వాముల బిక్షలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

Select Suryaa Now
నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

విజయవాడ క్రైం, మేజర్ న్యూస్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్.టి.ఆర్. పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిడమానూరు గ్రామంలో ఫ్లాగ్ మార్చ్, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈస్ట్ జోన్ డీసీపీ కృష్ణకాంత్ పటేల్ ఐపీఎస్ పర్యవేక్షణలో సెంట్రల్ ఏసీపీ దామోదరరావు, పటమట ఇన్‌స్పెక్టర్ పవన్ కిషోర్, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేపడుతూ గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజలకు రక్షణ, ఓటర్లకు భద్రత, ఎన్నికలకు ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీసుల లక్ష్యమని స్పష్టం చేశారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.