BREAKING
తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన కానూరు, పోరంకిలో వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ విస్తృత ప్రచారం తొర్రూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి అన్నారంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు - శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో కన్నులపండువగా దీపోత్సవం, తులసి కళ్యాణం అయ్యప్ప స్వాముల బిక్షలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష

Select Suryaa Now
కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష

విజయవాడ, మేజర్ న్యూస్: ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరా నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదులు, రెవెన్యూ వసూళ్లు, లైన్ లాస్ తగ్గింపు, విద్యుత్ భద్రత, సబ్‌స్టేషన్ల అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ అందించాలని, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. పీఎం సూర్య ఘర్, ఆర్‌డీఎస్ఎస్ పథకాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. కొత్త విద్యుత్ కనెక్షన్ల కోసం ఈ-సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, www.apcpdcl.in వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కేంద్రాలు, సంబంధిత ప్రాంతాల్లో నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు ఎస్. వెంకటేశ్వర్లు, ఆవుల మురళీకృష్ణ యాదవ్, కృష్ణా సర్కిల్ ఎస్‌ఈ హరిబాబు, ఈఈలు కన్నయ్య నాయుడు, రాజశేఖర్ బాబు, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.