BREAKING
10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన కానూరు, పోరంకిలో వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ విస్తృత ప్రచారం తొర్రూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి అన్నారంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు - శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో కన్నులపండువగా దీపోత్సవం, తులసి కళ్యాణం అయ్యప్ప స్వాముల బిక్షలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కార్తీక పౌర్ణమి వేళ విషాదం-గోదావరిలో బాలుడు మృతి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియలో జాగ్రత్తలు పాటించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హనుమకొండ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆత్మకూరు మండలంలో కన్నుల పండువగ కార్తీక పౌర్ణమి వేడుకలు అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీని పట్టుకున్న పోలీసులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు దీక్ష దివాస్ సభ స్థలాన్ని పరిశీలన కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ గణపేశ్వర ఆలయంలో భక్తుల కోలాహలం

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియలో జాగ్రత్తలు పాటించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

Select Suryaa Now
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియలో జాగ్రత్తలు పాటించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్, మేజర్ న్యూస్, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లబ్ధిదారుల నమోదు ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు, లబ్ధిదారుల నమోదు కేంద్రాల పనితీరుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ ఈ నెల 19వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 18వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రతి కుటుంబానికి బీమా పొందేందుకు ఎంపిక చేసిన వ్యక్తి వివరాలతో పాటు, వారి నామినీ పేరును తప్పనిసరిగా పథకం పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. బీమా పొందే వ్యక్తి వయస్సు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలని, నమోదు సమయంలో లబ్ధిదారుల ఆధార్, కుటుంబ వివరాలు, నామినీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. నామినీలకు కేటాయించే వాటాల శాతం మొత్తం 100 శాతం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.పోర్టల్‌లో వివరాలు నమోదు చేసే సమయంలో ఎలాంటి తప్పులు జరగకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నమోదు చేసిన వివరాలను మరోసారి పరిశీలించి ధృవీకరించాలని ఆదేశించారు. నమోదు కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, పెండింగ్ దరఖాస్తులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రయోజనం అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
టెలికాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్, (లోకల్ బాడీస్) వై.వి. గణేష్, డీఆర్వో విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు సుమ, ఉమారాణి, జెడ్పీ సీఈవో వసంత, డీపీవో కల్పన, సీపీవో చంద్రకళ, డీఆర్డీవో నాగపద్మజ, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్, సంతోష్, వరంగల్ సిటీ ,వరంగల్ జిల్లా