కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ గణపేశ్వర ఆలయంలో భక్తుల కోలాహలం
నర్సంపేట, మేజర్ న్యూస్, కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ గణపేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయం అంతా భక్తి భావంతో, దీప కాంతులతో వెలిగిపోయింది.ఈ సందర్భంగా స్వామివారికి ఘనంగా పూజలు, పాలాభిషేకం, పంచామృతాలతో, బిల్వ పత్రాలతో పూజలు నిర్వహించారు. అర్చకులు శివశంకర్, అభిరామ్ ఆధ్వర్యంలో అభిషేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో గ్రామ 7వ వార్డు మెంబర్ జనగం లావణ్య, ప్రవీణ్ కుమార్ పాల్గొని తమ వంతుగా గణపేశ్వర స్వామికి దీప మాణిక్యాలు బహుకరించారు. అనంతరం అభిషేక పూజలు చేసి, రానున్న రోజుల్లో శివాలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు,మహిళ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్ ; ప్రవీణ్, నర్సంపేట ,వరంగల్ జిల్లా