12 ఏళ్లుగా సేవ చేస్తున్నా.. జీతం 6 నెలలకు ఒకసారి!.
డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఆవేదన.
ఇంజినీర్-ఇన్-చీఫ్‌కు వినతిపత్రం అందజేసిన డీఈఓలు.
అనకాపల్లి, నవంబర్ 24, మేజర్ న్యూస్: గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖలో గత 12 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు (డీఈఓలు) తమ సమస్యలపై ఇంజినీర్-ఇన్-చీఫ్‌కు వినతిపత్రం అందజేశారు. మండలంలోని సంపతిపురం మెగా తాగునీటి పథకం వద్ద రివ్యూ మీటింగ్ హాజరైన ఆమెకు ప్రతిపత్రం అందజేశారు. సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో థర్డ్ పార్టీ (కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్) పద్ధతిలో పనిచేస్తున్న తమకు జీతాలు ఆరు నెలలకు ఒకసారి వస్తున్నాయని, దీంతో కుటుంబ పోషణ, పిల్లల చదువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా సంబంధిత అకడమిక్ విద్యార్హతలతో పాటు సాంకేతిక విద్యార్హతలు కలిగి ఉన్నామని, కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి కూడా దాటిపోయినందున వేరే ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేదని వాపోయారు. నెల నెలా జీతాలు అందకపోవడం, జీతాల చెల్లింపులో అన్ని జిల్లాల్లో ఒకే విధానం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తమ వేతనాలను జేజేఎం 5% గ్రాంట్ కింద చెల్లిస్తున్నారని, అది కూడా 6 నెలలకు ఒకసారి చెల్లించడం జరుగుతోందని పేర్కొన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసరాల ఖర్చులు, పిల్లల చదువులతో తమ ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నుంచి కాకుండా నేరుగా వేతనాలు అందేలా ఒకే ఏజెన్సీని ప్రవేశపెట్టి, ఔట్ సోర్సింగ్ ద్వారా వేతనాలు వచ్చేలా చూడాలని కోరారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా ఒకే ఏజెన్సీలోకి చేర్చి, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వేతనాలు పెంచి, పీఎఫ్, ఈఎస్ఐతో కలిపి నెల నెలా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విభాగంలో ల్యాబ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇప్పటికే ఒకే ఏజెన్సీలోకి తీసుకున్నారని, అదే విధంగా తమను కూడా అదే ఏజెన్సీ పద్ధతిలో తీసుకుని వేతనాలు చెల్లించాలని కోరారు. తమ సమస్యలపై దృష్టి సారించి ఉద్యోగ భద్రత కల్పించాలని, తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లు వినయపూర్వకంగా నిన్ను తీ పత్రంలో ప్రార్థించారు.