అనకాపల్లిలో రెవిన్యూ ట్యాక్స్ మేళా.
24, 25 తేదీల్లో జోనల్ కార్యాలయంలో దస్తావేజులు సమర్పించాలి.
అనకాపల్లి, నవంబర్ 24, మేజర్ న్యూస్: జీవీఎంసీ కమిషనర్ మౌఖిక ఆదేశాల మేరకు అనకాపల్లి పట్టణ పరిధిలో రెవిన్యూ ట్యాక్స్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనకాపల్లి పట్టణ పరిధిలో గల భవనములకు, ఖాళీ స్థలములకు నేటికీ ఎటువంటి మునిసిపల్ పన్ను విధించకుండా ఉన్నవాటికి, సదరు ఆస్తికి సంబంధించిన అన్ని దస్తావేజులను ఈ నెల 24, 25 తేదీల్లో అనకాపల్లి జోనల్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. దస్తావేజులు సమర్పించిన యెడల మీ భవనములకు లేదా ఖాళీ స్థలమునకు పన్ను విధింపు కొరకు తదుపరి చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.