నాన్న రాక కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు పిడుగు లాంటి వార్త
రావికమతం - నవంబర్ 24, మేజర్ న్యూస్.: మండలంలో. తట్టబందలోని ఆ చిన్న ఇంటి గుమ్మం ముందు ఇద్దరు చిన్నారి కుమార్తెలు నిలబడి "నాన్న వస్తున్నాడా?" అని దారి వైపు చూస్తుంటారు. ఆయన చేతిలో ఏదో ఒకటి ఉంటుంది. ఒక్కోసారి చాక్లెట్.ఒక్కోసారి స్వీట్.ఒక్కోసారి డ్రెస్,..
ఆ చిన్న చిన్న ఆనందాలే ఆ పిల్లల ప్రపంచం. నాన్న అంటే వాళ్లకు కేవలం తండ్రి కాదు ఓ పండుగ. యధావిధిగా
డ్యూటీకి వెళ్లిన తండ్రి రాక కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు పిడుగు లాంటి వార్త
. సబ్బవరం మండలం బాట జంగాలపాలెం వద్ద రెండు టిప్పర్లు ఢీకొన్నా ప్రమాదంలో తండ్రి మహదేవ నాగ సూరి అప్పారావు బయటకు రాలేక సజీవ దహనమయ్యారని అంతే భార్య కుప్పకూలిపోయింది. నాన్న కోసం కన్నీరు మున్నిరవుతున్న పిల్లల దుఃఖంతో ఇల్లు నిండిపోయింది
సూరి అప్పారావు స్వగ్రామం చోడవరం సమీపంలోని లక్ష్మీపురం. బతుకుదెరువు కోసం అత్తవారి ఊరు తట్టబందలో స్థిరపడ్డారు. ప్రైవేట్ కంపెనీలో టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తూ, రాత్రి పగలు కష్టపడి భార్యా పిల్లలను పోషిస్తున్నారు.. రెక్కల కష్టం తో , తన పిల్లల మొమో లో చిరునవ్వే తన ఆస్తిగా సంతోషపడే వారిని కుటుంబ సభ్యులు తెలిపారు.ఇప్పుడు ఆ రెక్క విరిగిపోయింది. ఆ చిరునవ్వులు కన్నీళ్లుగా మారాయి.ఆ ఇంట్లో ఇప్పుడు మిగిలింది నిశ్శబ్దం... ఎదురుచూపు... తీరని లోటు మాత్రమే