BREAKING
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు దీక్ష దివాస్ సభ స్థలాన్ని పరిశీలన కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ గణపేశ్వర ఆలయంలో భక్తుల కోలాహలం రేపు త్యాగరాజ మల్టీపర్సస్ ఫంక్షన్ హాల్ ప్రారంభం మాచవరం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల జోరు.. 12 ఏళ్లుగా సేవ చేస్తున్నా.. జీతం 6 నెలలకు ఒకసారి!. ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా... బంగారమ్మపాలెంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్! పాఠశాలలో క్యూఆర్ కోడ్ నిఘా -ఇక బడిలో లోపం ఉంటే..ఫోన్‌లోనే ఫిర్యాదు -ప్రతి స్కూల్‌లో క్యూఆర్ కోడ్ పోస్టర్ తప్పనిసరి -స్కాన్ చేస్తే చాలు మీ మాట ప్రభుత్వానికి -విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకే పెద్దపీట : డీఈఓ కెవిఎన్ కుమార్ 24 గంటల్లోనే రూ. 33,500 కోట్ల వసూళ్లు.. అవెంజర్స్ ఎండ్‌గేమ్ రికార్డును బద్దలు కొట్టిన జీటీఏ 6 చింతకాయల విజయ్ చొరవతో నర్సీపట్నంలో 56 సీసీ కెమెరాలు ప్రారంభం నర్సీపట్నం గ్రంథాలయానికి రూ.35 వేల విలువైన 50 పుస్తకాల అందజేత బాబురావు మాస్టారు సేవకు ప్రజల సెల్యూట్! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి హోంమంత్రి అనిత అండ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. తేగాడలో ఎన్నికల అవగాహన.

రేపు త్యాగరాజ మల్టీపర్సస్ ఫంక్షన్ హాల్ ప్రారంభం

Select Suryaa Now
రేపు త్యాగరాజ మల్టీపర్సస్ ఫంక్షన్ హాల్ ప్రారంభం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : త్యాగరాజ మండపం స్థానంలో ఆధునాతనంగా నిర్మించిన శ్రీత్యాగరాజ మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు ఈనెల 26వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు అంత్యంత వేడుకగా ప్రారంభిస్తున్నట్లు శ్రీత్యాగరాజ ఫెస్టివల్ కమిటీ ఎగ్జికూటివ్ చైర్మన్ మోహన్ సుందరం, కార్యదర్శి కంచి రఘురామయ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం త్యాగరాజ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత శతాబ్దకాలంగా ఆధ్యాత్మిక తిరుపతి నగరంలో సాంస్కృతిక కార్యక్రమాలకు కేరాఫ్ చిరునామా ఉన్న నాటి త్యాగరాజ మండపం త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీత్యాగరాజ స్వామి కల్చరల్ ట్రస్టగా అవతరించిందని తెలిపారు. తద్వారా త్యాగరాజ మండపం స్థానంలో సాంస్కృతిక కార్యక్రమాలకు ఎంతో అనువుగా అత్యంత సుందరంగా భవనాలు నిర్మించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన త్యాగరాజ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ను కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫంక్షన్ హాలు అందరూ అద్భుతంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు దోహదపడేలా ఏర్పాటు చేశామని. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు వేణుగోపాల్ రెడ్డి, సింగరాజు ప్రబాకర్, భీమాస్ అశోక్ పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్