తేగాడలో ఎన్నికల అవగాహన.
శాంతిభద్రతలు కాపాడాలి, ఎన్నికల నియమావళి పాటించాలి.
- సీఐ అల్లుస్వామి నాయుడు.
కశింకోట, నవంబర్ 25, మేజర్ న్యూస్: రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కశింకోట పోలీస్ స్టేషన్ సీఐ అల్లుస్వామి నాయుడు, ఎస్‌ఐ లక్ష్మణరావు మంగళవారం తేగాడ గ్రామాన్ని సందర్శించి ఎన్నికల అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు, యువతకు శాంతిభద్రతలను కాపాడాలని, పోలీసులకు సహకరించాలని సూచించారు. ఎన్నికల మార్గదర్శకాలు మరియు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ని కచ్చితంగా పాటించాలని అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో ఎవరూ గొడవలకు, వివాదాలకు తావివ్వవద్దని, గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సీఐ కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.