నర్సీపట్నం గ్రంథాలయానికి రూ.35 వేల విలువైన 50 పుస్తకాల అందజేత
- పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉపయోగపడేలా ఎంపీ చింతకాయల విజయ్ ప్రత్యేక చొరవ
నర్సీపట్నం నవంబర్ 24 మేజర్ న్యూస్:
రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ పుట్టినరోజు సందర్భంగా నర్సీపట్నంలోని గ్రంథాలయానికి సుమారు రూ.35 వేల విలువైన 50 పుస్తకాలను అందజేశారు. గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వేతో పాటు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ.. నర్సీపట్నం గ్రంథాలయాన్ని ఎంతోమంది విద్యార్థులు వినియోగించుకుంటున్నారని చెప్పారు. సివిల్స్, ఐపీఎస్, ఐఏఎస్‌లతో పాటు బ్యాంకింగ్, రైల్వే, గ్రూప్స్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షల్లో రాణించడానికి సరైన మెటీరియల్ అందుబాటులో ఉండాలని, అలాగే ఆధునిక సాంకేతికతను కూడా అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రివిజన్, సెల్ఫ్ టెస్ట్‌ల కోసం ఉపయోగపడే యాప్ వంటి సదుపాయాలను కూడా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని వెల్లడించారు. గ్రంథాలయాన్ని ఆధునీకరించడం, పోటీ పరీక్షల నిపుణులతో తరగతులు నిర్వహించడం, చర్చల కోసం ప్రత్యేక హాల్ ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామని, తన ఎంపీ నిధులను ఈ అభివృద్ధికి వినియోగిస్తానని తెలిపారు. నర్సీపట్నం ప్రాంత యువత అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు.