BREAKING
దీక్ష దివాస్ సభ స్థలాన్ని పరిశీలన కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ గణపేశ్వర ఆలయంలో భక్తుల కోలాహలం రేపు త్యాగరాజ మల్టీపర్సస్ ఫంక్షన్ హాల్ ప్రారంభం మాచవరం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల జోరు.. 12 ఏళ్లుగా సేవ చేస్తున్నా.. జీతం 6 నెలలకు ఒకసారి!. ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా... బంగారమ్మపాలెంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్! పాఠశాలలో క్యూఆర్ కోడ్ నిఘా -ఇక బడిలో లోపం ఉంటే..ఫోన్‌లోనే ఫిర్యాదు -ప్రతి స్కూల్‌లో క్యూఆర్ కోడ్ పోస్టర్ తప్పనిసరి -స్కాన్ చేస్తే చాలు మీ మాట ప్రభుత్వానికి -విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకే పెద్దపీట : డీఈఓ కెవిఎన్ కుమార్ 24 గంటల్లోనే రూ. 33,500 కోట్ల వసూళ్లు.. అవెంజర్స్ ఎండ్‌గేమ్ రికార్డును బద్దలు కొట్టిన జీటీఏ 6 చింతకాయల విజయ్ చొరవతో నర్సీపట్నంలో 56 సీసీ కెమెరాలు ప్రారంభం నర్సీపట్నం గ్రంథాలయానికి రూ.35 వేల విలువైన 50 పుస్తకాల అందజేత బాబురావు మాస్టారు సేవకు ప్రజల సెల్యూట్! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి హోంమంత్రి అనిత అండ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. తేగాడలో ఎన్నికల అవగాహన. అనకాపల్లిలో రెవిన్యూ ట్యాక్స్ మేళా.

చింతకాయల విజయ్ చొరవతో నర్సీపట్నంలో 56 సీసీ కెమెరాలు ప్రారంభం

Select Suryaa Now
చింతకాయల విజయ్ చొరవతో నర్సీపట్నంలో 56 సీసీ కెమెరాలు ప్రారంభం


ఎంపీ విజయ్ కు కృతజ్ఞతలు తెలిపిన సిఐ గఫూర్ 
నర్సీపట్నం నవంబర్ 24 మేజర్ న్యూస్ :
​నర్సీపట్నం: నేరాలను అరికట్టడంతో పాటు ఆకతాయిల ఆగడాలు, ర్యాగింగ్‌ను నివారించే లక్ష్యంతో నర్సీపట్నం పట్టణంలోని ప్రధాన వీధులు, కూడళ్లలో ఏర్పాటు చేసిన 56 సీసీ కెమెరాలను మంగళవారం రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ ప్రారంభించారు.  
​ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ.. సమస్యలు సృష్టించే వారిపై కచ్చితమైన ఆధారాలు ఉండాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు నిరంతరం దీనిపై ఫాలో అప్ చేస్తూ వచ్చారని తెలిపారు. సీఐ గారు సీసీ కెమెరాల ఆవశ్యకతను, ర్యాగింగ్ సమస్యను తన దృష్టికి తీసుకురాగానే తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలోని ప్రధాన జంక్షన్లు, రద్దీ ప్రాంతాలు, దేవాలయాలు, షాపులు, పోలీస్ స్టేషన్ల వద్ద పాత కెమెరాలను బాగుచేయించడంతో పాటు, సుమారు  కొత్త కెమెరాలు 56  ఏర్పాటు చేసినట్లు విజయ్ వివరించారు.  
​ఏఐ టెక్నాలజీతో నిరంతర నిఘా
​ఈ కెమెరాలను పోలీసులు లైవ్‌లో పర్యవేక్షించే వీలుందని చింతకాయల విజయ్ తెలిపారు. అనకాపల్లి సాంకేతిక నిపుణుల సహకారంతో వీటికి ఏఐ (AI) టెక్నాలజీని అనుసంధానం చేశామని, దీని ద్వారా వాహనాలు వేగంగా వెళ్లినా వాటి నంబర్లను సైతం సులభంగా గుర్తించవచ్చని చెప్పారు.   ​స్మార్ట్ నర్సీపట్నంలో భాగంగా మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మావతి గారి సహకారంతో కెమెరాల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఆధునిక టెక్నాలజీతో వీటిని ఏర్పాటు చేసినట్లు విజయ్ స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా తన వంతు బాధ్యతగా నర్సీపట్నాన్ని 'జీరో క్రైమ్' (నేర రహిత) పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. భవిష్యత్తులో సృష్టి క్షేత్రంగా, వివిధ కార్యక్రమాలకు బయట ప్రాంతాల నుంచి భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించిన పోలీస్ శాఖకు, సహకరించిన సిబ్బందికి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో నర్సీపట్నం పట్టణ సీఐ గఫూర్, ఎస్సై ఉమామహేశ్వరరావు కార్తికేయ కౌన్సిలర్స్  సిబ్బంది పాల్గొన్నారు.