BREAKING
దీక్ష దివాస్ సభ స్థలాన్ని పరిశీలన కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ గణపేశ్వర ఆలయంలో భక్తుల కోలాహలం రేపు త్యాగరాజ మల్టీపర్సస్ ఫంక్షన్ హాల్ ప్రారంభం మాచవరం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల జోరు.. 12 ఏళ్లుగా సేవ చేస్తున్నా.. జీతం 6 నెలలకు ఒకసారి!. ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా... బంగారమ్మపాలెంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్! పాఠశాలలో క్యూఆర్ కోడ్ నిఘా -ఇక బడిలో లోపం ఉంటే..ఫోన్‌లోనే ఫిర్యాదు -ప్రతి స్కూల్‌లో క్యూఆర్ కోడ్ పోస్టర్ తప్పనిసరి -స్కాన్ చేస్తే చాలు మీ మాట ప్రభుత్వానికి -విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకే పెద్దపీట : డీఈఓ కెవిఎన్ కుమార్ 24 గంటల్లోనే రూ. 33,500 కోట్ల వసూళ్లు.. అవెంజర్స్ ఎండ్‌గేమ్ రికార్డును బద్దలు కొట్టిన జీటీఏ 6 చింతకాయల విజయ్ చొరవతో నర్సీపట్నంలో 56 సీసీ కెమెరాలు ప్రారంభం నర్సీపట్నం గ్రంథాలయానికి రూ.35 వేల విలువైన 50 పుస్తకాల అందజేత బాబురావు మాస్టారు సేవకు ప్రజల సెల్యూట్! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి హోంమంత్రి అనిత అండ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. తేగాడలో ఎన్నికల అవగాహన. అనకాపల్లిలో రెవిన్యూ ట్యాక్స్ మేళా.

ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా... బంగారమ్మపాలెంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్!

Select Suryaa Now
ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా... బంగారమ్మపాలెంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్!

 

ఎస్.రాయవరం, నవంబర్ 24, మేజర్ న్యూస్:
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో మంగళవారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరగకుండా శాంతిభద్రతలను కాపాడేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు.నక్కపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఎల్.రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఫ్లాగ్ మార్చ్ లో ఎస్.రాయవరం ఎస్ఐ ఎస్.రమేష్, ఆర్ఎస్ఐ మరియు ఎస్.రాయవరం పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాల సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఐ రామకృష్ణ మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎటువంటి గొడవలకు తావులేకుండా చూడటంతో పాటు, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజల్లో భరోసా కల్పించారు.