BREAKING
రేపు త్యాగరాజ మల్టీపర్సస్ ఫంక్షన్ హాల్ ప్రారంభం మాచవరం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల జోరు.. 12 ఏళ్లుగా సేవ చేస్తున్నా.. జీతం 6 నెలలకు ఒకసారి!. ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా... బంగారమ్మపాలెంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్! పాఠశాలలో క్యూఆర్ కోడ్ నిఘా -ఇక బడిలో లోపం ఉంటే..ఫోన్‌లోనే ఫిర్యాదు -ప్రతి స్కూల్‌లో క్యూఆర్ కోడ్ పోస్టర్ తప్పనిసరి -స్కాన్ చేస్తే చాలు మీ మాట ప్రభుత్వానికి -విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకే పెద్దపీట : డీఈఓ కెవిఎన్ కుమార్ 24 గంటల్లోనే రూ. 33,500 కోట్ల వసూళ్లు.. అవెంజర్స్ ఎండ్‌గేమ్ రికార్డును బద్దలు కొట్టిన జీటీఏ 6 చింతకాయల విజయ్ చొరవతో నర్సీపట్నంలో 56 సీసీ కెమెరాలు ప్రారంభం నర్సీపట్నం గ్రంథాలయానికి రూ.35 వేల విలువైన 50 పుస్తకాల అందజేత బాబురావు మాస్టారు సేవకు ప్రజల సెల్యూట్! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి హోంమంత్రి అనిత అండ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. తేగాడలో ఎన్నికల అవగాహన. అనకాపల్లిలో రెవిన్యూ ట్యాక్స్ మేళా. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. నాన్న రాక కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు పిడుగు లాంటి వార్త

బాబురావు మాస్టారు సేవకు ప్రజల సెల్యూట్!

Select Suryaa Now
బాబురావు మాస్టారు సేవకు ప్రజల సెల్యూట్!


భార్య ను ఏకగ్రీవంగా గెలిపించిన తిమ్మాపురం!

తిమ్మాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా శానాపతి కమలకుమారి ఏకగ్రీవ ఎన్నిక

ఎస్.రాయవరం, నవంబర్ 24, మేజర్ న్యూస్:
పదవి కోసం సేవ కాదు... సేవ చేస్తే పదవే వెతుక్కుంటూ వస్తుందని నిరూపించింది తిమ్మాపురం గ్రామం. చేసిన మంచి ఎప్పటికీ వృధా కాదని, ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని చాటి చెబుతూ గ్రామస్తులంతా ఏకమై ఒక ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు.

తిమ్మాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా శానాపతి కమలకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె భర్త ప్రముఖ సామాజిక సేవకులు, విద్యావేత్త శానాపతి బాబురావు మాస్టర్ సతీమణి.

పదవితో సంబంధం లేని సేవకు దక్కిన గౌరవం...
శానాపతి బాబురావు మాస్టర్ ఎంతో కాలంగా 'కుసుమ కావ్య ఫౌండేషన్' ద్వారా పదవులతో, ప్రతిఫలంతో సంబంధం లేకుండా ప్రజా సేవే పరమావధిగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కష్టంలో ఉన్నవారికి అండగా నిలబడటం, విద్యార్థులకు చేయూత, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలతో ఆయన గ్రామంలో ఒక నమ్మకాన్ని, ఒక విలువను సంపాదించుకున్నారు. ఆ మాస్టారి నిరంతర కృషి, నిస్వార్థ సేవా భావం ఈ రోజు ఆయన కుటుంబానికి ఒక గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఆయన సతీమణి శానాపతి కమలకుమారి ని గ్రామస్తులంతా ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకోవడం ద్వారా "సేవకు పట్టం" కట్టారు!

ఇది ఎన్నిక కాదు... సేవకు ప్రజలు ఇచ్చిన బహుమతి!
ఇది కేవలం ఒక ఎన్నిక కాదు... నిజాయితీగా సేవ చేసే వ్యక్తికి ప్రజలు ఇచ్చే గొప్ప బహుమానం. కమలకుమారి నాయకత్వంలో, బాబురావు మాస్టర్ అనుభవం, మార్గదర్శకత్వంతో తిమ్మాపురం గ్రామం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందుతాయని గ్రామ పెద్దలు, యువత, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నూతన సర్పంచ్ శానాపతి కమలకుమారి కి, శానాపతి బాబురావు మాస్టర్ కి గ్రామం తరపున హృదయపూర్వక అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.