BREAKING
దీక్ష దివాస్ సభ స్థలాన్ని పరిశీలన కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ గణపేశ్వర ఆలయంలో భక్తుల కోలాహలం రేపు త్యాగరాజ మల్టీపర్సస్ ఫంక్షన్ హాల్ ప్రారంభం మాచవరం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల జోరు.. 12 ఏళ్లుగా సేవ చేస్తున్నా.. జీతం 6 నెలలకు ఒకసారి!. ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా... బంగారమ్మపాలెంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్! పాఠశాలలో క్యూఆర్ కోడ్ నిఘా -ఇక బడిలో లోపం ఉంటే..ఫోన్‌లోనే ఫిర్యాదు -ప్రతి స్కూల్‌లో క్యూఆర్ కోడ్ పోస్టర్ తప్పనిసరి -స్కాన్ చేస్తే చాలు మీ మాట ప్రభుత్వానికి -విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకే పెద్దపీట : డీఈఓ కెవిఎన్ కుమార్ 24 గంటల్లోనే రూ. 33,500 కోట్ల వసూళ్లు.. అవెంజర్స్ ఎండ్‌గేమ్ రికార్డును బద్దలు కొట్టిన జీటీఏ 6 చింతకాయల విజయ్ చొరవతో నర్సీపట్నంలో 56 సీసీ కెమెరాలు ప్రారంభం నర్సీపట్నం గ్రంథాలయానికి రూ.35 వేల విలువైన 50 పుస్తకాల అందజేత బాబురావు మాస్టారు సేవకు ప్రజల సెల్యూట్! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి హోంమంత్రి అనిత అండ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. తేగాడలో ఎన్నికల అవగాహన. అనకాపల్లిలో రెవిన్యూ ట్యాక్స్ మేళా.

పాఠశాలలో క్యూఆర్ కోడ్ నిఘా -ఇక బడిలో లోపం ఉంటే..ఫోన్‌లోనే ఫిర్యాదు -ప్రతి స్కూల్‌లో క్యూఆర్ కోడ్ పోస్టర్ తప్పనిసరి -స్కాన్ చేస్తే చాలు మీ మాట ప్రభుత్వానికి -విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకే పెద్దపీట : డీఈఓ కెవిఎన్ కుమార్

Select Suryaa Now
పాఠశాలలో క్యూఆర్ కోడ్ నిఘా -ఇక బడిలో లోపం ఉంటే..ఫోన్‌లోనే ఫిర్యాదు -ప్రతి స్కూల్‌లో క్యూఆర్ కోడ్ పోస్టర్ తప్పనిసరి -స్కాన్ చేస్తే చాలు మీ మాట ప్రభుత్వానికి -విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకే పెద్దపీట : డీఈఓ కెవిఎన్ కుమార్

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : విద్యార్థుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసాత్మక పాఠశాలలలో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసిందని జిల్లా విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్ తెలిపారు. మీ పిల్లలు చదివే బడులలో ఏ సమస్య ఉంటే మీ ఫోన్ లోనే ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఏ సమస్య ఉన్న

ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీ ఫోన్‌లో ఒక్క స్కాన్ చాలు. మీ అభిప్రాయం, ఫిర్యాదు నేరుగా ప్రభుత్వానికి చేరుతుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ఆధారిత అభిప్రాయ సేకరణ వ్యవస్థను ప్రవేశపెట్టిందని జిల్లా విద్యాశాఖ అధికారి కెవిఎన్. కుమార్ వెల్లడించారు.

తిరుపతి జిల్లాలోని అన్ని విద్యాశాఖ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే ప్రజలు, సందర్శకులు, అభ్యర్థులు, సిబ్బంది, విద్యార్థులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు, వారి సౌకర్యాలను పర్యవేక్షించేందుకు ఈ నూతన విధానాన్ని అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

ప్రతి స్కూల్‌కి ప్రత్యేక కోడ్…

ప్రతి ప్రభుత్వ కార్యాలయం, పాఠశాలలో ప్రత్యేక క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. ఈ ప్రక్రియను ఏపీ సింగిల్ సైన్ ఆన్, పోర్టల్‌లోని ఓపీఎంఎస్ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాల, ప్రభుత్వ కార్యాలయం తమకు కేటాయించిన ప్రత్యేక క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను మాత్రమే ఉపయోగించాలి. ఇతర కార్యాలయాలు లేదా పాఠశాలలకు సంబంధించిన పోస్టర్లను వినియోగించకూడదు. సంబంధిత కార్యాలయాల అధిపతులు, ఉద్యోగులు ఓపీఎంఎస్ ద్వారా తమ కార్యాలయానికి సంబంధించిన పోస్టర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఏర్పాటు చేయాలి. తిరుపతి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఇప్పటికే క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను ఏర్పాటు చేశారు.

అధికారుల పర్యవేక్షణలో అమలు

జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, విద్యాశాఖ కార్యాలయాల్లో ఈ విధానం అమలయ్యేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని డీఈఓ ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలకు కేటాయించిన ప్రత్యేక క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఏర్పాటు చేయడంతోపాటు, పోస్టర్ ఏర్పాటు చేసిన ప్రదేశానికి సంబంధించిన జీపీఎస్ వివరాలతో కూడిన ఫొటోను ఓపీఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ విధానం ద్వారా ప్రభుత్వ విద్యాశాఖ కార్యాలయాలు, పాఠశాలల్లో అందుతున్న సేవలపై ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు, ఫిర్యాదులను నేరుగా తెలియజేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు.

సీఎం గౌడ్, తిరుపతి స్టాప్ రిపోర్టర్