ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి.
నవంబర్ 30లోగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిసెంబర్ 10లోగా పరిశీలన పూర్తి చేయాలి.
జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్
విశాఖపట్నం, నవంబర్ 23: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి విజయవాడ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ , ERO లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఓటరు జాబితాలో గుర్తించిన గైర్హాజరు, చిరునామా మార్పు, మరణించిన, డూప్లికేట్ ఓటర్ల వివరాలపై సమీక్ష నిర్వహించారు.
గతంలో ASDD గా గుర్తించి జాబితా నుంచి తొలగించిన ఓటర్లకు మరో అవకాశం కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, తిరిగి స్వీకరణ, పరిశీలనను నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఎన్యుమరేషన్ ఫారాలను ఈ నెల 30వ తేదీలోగా ఓటర్లకు పంపిణీ చేయడంతో పాటు, ఓటర్ల నుంచి స్వీకరించిన ఫారాలను డిసెంబర్ 10వ తేదీలోగా పరిశీలించాలని ఆదేశించారు. ఇంకా పంపిణీ చేయాల్సిన ఫారాలను రెండు రోజుల్లోగా పంపిణీ చేసి, ఇంటింటి సర్వేను వేగవంతం చేయాలని సూచించారు.
విశాఖపట్నం జిల్లాలో మొత్తం 2,40,170 ఓటర్లకు సంబంధించి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ చేపట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు 85,758 ఫారాలను పంపిణీ చేశారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2,143 పోలింగ్ స్టేషన్ల ద్వారా ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు.
నియోజకవర్గాల వారీగా ఫారాల పంపిణీ వివరాలు:
భీమిలి నియోజకవర్గంలో 400 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 31,536 మంది ఓటర్లకు గాను 10,657 ఫారాలు పంపిణీ చేశారు. విశాఖ తూర్పులో 285 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 34,257 మందికి గాను 12,541, విశాఖ దక్షిణలో 248 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 22,911 మందికి గాను 9,323, విశాఖ ఉత్తరలో 293 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 38,473 మందికి గాను 12,983 ఫారాలు పంపిణీ అయ్యాయి.
అలాగే విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 237 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 30,556 మందికి గాను 11,898, గాజువాకలో 339 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 56,468 మందికి గాను 18,684, పెందుర్తిలో 341 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 25,969 మందికి గాను 9,672 ఫారాలు పంపిణీ చేశారు.
విశాఖపట్నం జిల్లా లో వున్న ప్రజలు ఎవరైనా ముసాయిదా జాబితా కన్నా ముందు, పేరు వోటరు జాబితాలో వుండి ముసాయిదా జాబితాలో అబ్సెంత్, షిఫ్ట్, డెత్ మరియు డుప్లికేట్ గా ఏమైనా తొలగిచ బడి యున్నచో వారు వెంటనే వారి పోలింగ్ స్టేషన్ పరిది కి చెందిన BLO ను కాని ఓటరు నమోదు అధికారి (ERO) వారిని కాని సంప్రదించ వలసినదిగా తెలియ చేసి యున్నారు లేనిచో ఎన్నికల కమిషన్ వారి వెబ్ సైట్ నందు ఎనుమరేసన్ ఫోరమ్స్ డౌన్ లోడ్ చేసుకొని కూడా సంబందిత BLO నకు గాని ఓటరు నమోదు అధికారి (ERO) కార్యాలయం నందు కాని 30.11.2026 లోగ అందచేయ వలసినదిగా కోరారు. ఈ విసయమై అన్ని పొలిటికల్ పార్టీ ప్రతినిధులు మరియు జిల్లా ప్రజలు జిల్లా యంత్రాంగం నకు సహాకరించ వలసినది గా కలెక్టర్ కోరారు.