5,000/- ఆర్థిక సహాయం నిత్యావసర సరుకులను అందించిన........ పీపుల్స్ వెల్ఫేర్ సర్వీస్ సంస్థ అధ్యక్షులు గూడవల్లి గంగాధర్
పొన్నూరు మేజర్ న్యూస్:-పొన్నూరు పట్టణం రైలు పేట 12వ వార్డుకు చెందిన నీల గీత గత కొంతకాలంగా తీవ్రమైన కీళ్ల వ్యాధితో బాధపడుతూ ఇంటికే పరిమితమైనది. విషయం తెలుసుకున్న పీపుల్స్ వెల్ఫేర్ సర్వీస్ సంస్థ కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు.ఆమె దీనస్థితిని తెలుసుకున్న సంస్థ అధ్యక్షులు గూడవల్లి గంగాధర్ సోమవారం ఆమె నివాసానికి వెళ్ళి వైద్య ఖర్చులకు గాను 5000/- రు మరియు ఇంటికి సరిపడా నిత్యవసర సరుకులను అందించారు. అధ్యక్షులు గూడవల్లి గంగాధర్ మాట్లాడుతూ...... ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడం మానవ ధర్మమని అన్నారు. కష్టాలలో ఉన్న వారికి పేదలకు ఎల్లప్పుడూ పీపుల్స్ వెల్ఫేర్ సర్వీస్ సంస్థ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితురాలికి ధైర్యం చెప్పారు , త్వరగా కోలుకోవాలని కోరారు.. కష్టకాలంలో తమను ఆదుకున్న పీపుల్స్ వెల్ఫేర్ సర్వీస్ సభ్యులకు నీల గీత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సేవా కార్యక్రమంలో శ్రీరామ్ అరవిందు, లాజర్, సిలుమూరి సత్య తదితరులు పాల్గొన్నారు. సంస్థ చేస్తున్న సేవలను స్థానికులు అభినందించారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :-సిలర్