BREAKING
తప్పిపోయిన బాలిక ఆచూకీ లభించింది.. కీసర పోలీసుల గాలింపుతో క్షేమంగా ఇంటికి! రెండు గంటల పాటు గాలింపు.. కీసరవాణి పార్కింగ్ వద్ద గుర్తింపు తిరువూరుకు ఎమ్మెల్యే కొలికపూడి దూరం.. రెండు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా నేటి రాశి ఫలాలు25 నవంబర్, 2026 నేటి పంచాంగం25 నవంబర్, 2026 తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన

తప్పిపోయిన బాలిక ఆచూకీ లభించింది.. కీసర పోలీసుల గాలింపుతో క్షేమంగా ఇంటికి! రెండు గంటల పాటు గాలింపు.. కీసరవాణి పార్కింగ్ వద్ద గుర్తింపు

Select Suryaa Now
తప్పిపోయిన బాలిక ఆచూకీ లభించింది.. కీసర పోలీసుల గాలింపుతో క్షేమంగా ఇంటికి!  రెండు గంటల పాటు గాలింపు.. కీసరవాణి పార్కింగ్ వద్ద గుర్తింపు

కీసర, మేజర్ న్యూస్:   కీసరగుట్టకు వచ్చిన 15 ఏళ్ల బాలిక తప్పిపోవడంతో అప్రమత్తమైన కీసర పోలీసులు రెండు గంటల పాటు గాలింపు చేపట్టి ఆమె ఆచూకీ గుర్తించారు. కీసరవాణి పార్కింగ్ ప్రాంతంలో బాలికను సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.

బుసా లాస్య (15) అనే బాలిక తప్పిపోయినట్లు మంగళవారం రాత్రి సమాచారం అందడంతో కీసర సీఐ ఎలక్షన్ రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు రంగంలోకి దిగారు. కీసరగుట్ట పరిసరాల్లో గాలింపుతోపాటు బాలిక ఫొటో, వివరాలను వాట్సాప్ గ్రూపుల్లో పంపించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రకటనలు చేయించారు. వాహనాలను సైతం తనిఖీ చేశారు.

పోలీసులు సమన్వయంతో చేపట్టిన చర్యలతో కీసరవాణి పార్కింగ్ వద్ద బాలిక ఆచూకీ లభించింది. అనంతరం ఆమెను తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. ఈ గాలింపు చర్యల్లో ట్రాఫిక్ సీఐ శివశంకర్, స్థానిక పోలీసులు, ట్రాఫిక్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.