BREAKING
క్రిస్మస్ కానుకగా చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సహాయం-తిప్పన విజయేందర్ రెడ్డి 1008 జ్యోతులతో మహాశివునికి విశేష పూజలు పాల్గొన్న ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్‌ ఛైర్మన్‌ ధర్మవరం సుబ్బారెడ్డి తిరుమల శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం నగరం మండలంలో నామినేషన్లు పరిశీలన అనంతరం120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు ఖరారు కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామంలో కత్తెరకు అపూర్వ స్పందన. చిందుకూరు సర్పంచుగా సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవ ఎన్నిక విజ్ఞాన యాత్రలో నగరం మండల రైతులు ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు

కూటమి అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు విసృత ప్రచారం

Select Suryaa Now
కూటమి అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే  వేగేశన నరేంద్ర వర్మ రాజు విసృత ప్రచారం

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1వ వార్డులో కూటమి అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు, కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీ ఇస్కా సునీల్ కుమార్ గారు, బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకటశివన్నారాయణ గార్లు స్థానిక వార్డులలో పర్యటించారు.
వార్డు కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ వెళ్తూ కూటమి మేనిఫెస్టోను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి కూటమి అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వార్డుల కౌన్సిలర్ అభ్యర్థి ,కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.