జిల్లా న్యూక్లియర్ మెడికల్ అధికారి గా అధికారిగా డాక్టర్ వెంకటేశ్వర నాయక్
మార్కాపురం,మేజర్‌న్యూస్ :
మార్కాపురం పట్టణంలో ప్రభుత్వ వైద్యశాలలో 9 సంవత్సరాల అనుభవం ఉన్న డాక్టర్ వెంకటేశ్వర నాయక్ మార్కాపురం ప్రభుత్వం వారు గుర్తించి జిల్లా న్యూక్లియర్ మెడికల్ అధికారి గా అధికారికంగా ప్రకటించారు. ఈయన 6 సంవత్సరాల అర్బన్ హెల్త్ సెంటర్ ప్రభుత్వ వైద్యశాలలో పని చేశారు. అలాగే ఎర్రగొండపాలెం నియోజకవర్గం పాలుట్ల గ్రామంలో కూడా 3 సంవత్సరాల ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసిన అనుభవం ఉంది. ఈయన కరోనా సమయంలో కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించారు.