డిప్యూటీ మేయర్ గోపినాథ్‌కు బీజేపీ నాయకుల అభినందనలు
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
చిత్తూరు నగరపాలక సంస్థ నూతన డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన ఎ. గోపినాథ్‌ను బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ ఇన్‌ఛార్జి, బీజేపీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, బీజేపీ జిల్లా నాయకుడు ఎం. బ్రహ్మానందరెడ్డి, చిత్తూరు నగర ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాసులు పాల్గొని ఎ. గోపినాథ్‌కు అభినందనలు తెలిపారు.బీజేపీ నాయకులు మాట్లాడుతూ గోపినాథ్‌కు డిప్యూటీ మేయర్ పదవి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. నగర అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసి పని చేస్తామని తెలిపారు. గోపినాథ్ తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్