పంచాయతీ ఎన్నికలు – రిటర్నింగ్ అధికారులకు శిక్షణ
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
ప్రకాశం జిల్లాలో రెండవ దశలో ఈ నెల 29 వ తేదీ అద్దంకి డివిజన్ పరిధిలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు కలెక్టరేట్‌లోని PGRS హాలులో రిటర్నింగ్ అధికారులకు 2వ దశ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు .
???? ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల నోడల్ అధికారి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బీసీ కార్పొరేషన్ *శ్రీ M. వెంకటేశ్వర్లు గారు* స్టేజ్-II ఎన్నికల ప్రక్రియపై అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు.
???? ప్రతి గ్రామ పంచాయతీకి స్టేజ్-II రిటర్నింగ్ అధికారిని నియమించడం జరిగింది. ఎన్నికల ప్రక్రియను బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని సూచించారు.
???? *చట్టపరమైన అంశాలు:*
ఆర్టికల్ 243K ప్రకారం పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి పర్యవేక్షణ, మార్గదర్శకత్వం, నియంత్రణ అధికారాలు ఉంటాయని, ఏపీ పంచాయతీరాజ్ చట్టం–1994, సెక్షన్ 210(2) ప్రకారం ఎన్నికల అధికారులు SEC నియంత్రణలో విధులు నిర్వహిస్తారని వివరించారు.
???? *రిటర్నింగ్ అధికారుల ప్రధాన బాధ్యతలు:*
1️⃣ పోస్టల్ బ్యాలెట్లు, EDCల జారీ.
2️⃣ కేటాయించిన గ్రామ పంచాయతీలో పోలింగ్ కేంద్రాల తనిఖీ.
3️⃣ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) అమలు పర్యవేక్షణ.
4️⃣ పోలింగ్ సిబ్బందికి శిక్షణ, ఎన్నికల సామగ్రి పంపిణీ.
5️⃣ అన్ని వార్డుల్లో పోలింగ్ ఏర్పాట్ల పర్యవేక్షణ.
6️⃣ పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించి, ఉదయం 7 గంటల మధ్యాహ్నం ఒకటి వరకు పోలింగ్ నిర్వహించి తదుపరి సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు నిర్వహణ.
7️⃣ ఎన్నికల ఫలితాల ప్రకటన, ఎన్నికైన అభ్యర్థులకు ధృవపత్రాల జారీ.
8️⃣ ఉపసర్పంచ్ ఎన్నికకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు.
9️⃣ ఎన్నికల అనంతరం ఉపయోగించిన, ఉపయోగించని బ్యాలెట్ పత్రాలు, ఇతర ఎన్నికల సామగ్రిని రిసెప్షన్ కేంద్రంలో అప్పగించడం.
???? ఎన్నికల ప్రక్రియను *పారదర్శకంగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా* నిర్వహించేందుకు ప్రతి రిటర్నింగ్ అధికారి పూర్తి బాధ్యతతో విధులు నిర్వర్తించాలని నోడల్ అధికారి సూచించారు.