కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అరుణాచల గిరిప్రదక్షిణకు నిర్మల్ డిపోనుండి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు : డిపోమేనేజర్ కల్పన. :
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి. :
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆర్టీసీ నిర్మల్ డిపో నుండి ఈ రోజు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు అరుణాచల గిరి ప్రదక్షిణ కు ప్రారంభించినట్లు డిపోమేనేజర్ కల్పన తెలిపారు.ఈ బస్సు ఈ రోజు బయలుదేరి 24వ తేదీన ఉదయం 7 గంటలకు కానిపాకం వరహసిద్ధి వినాయకుని దర్శించుకొని అదే రోజు ( తిరువన్నమలై) అరుణాచలం లో కొండే శివుడైన ఆ మహాదేవుని చుట్టు 14 కి.మీ. గిరిప్రదక్షణ స్వామి వారిని దర్శించుకొని 25 వ తేదీ కంచి కామక్షమ్మ శక్తిపీఠమ్, బంగారు బల్లి, వెండి బల్లి దర్శించుకొని అదే రోజు సాయంత్రం శ్రీ కాళహస్తి లో వాయులింగం దర్శించుకొని 26వ తేదీన రాత్రి నిర్మల్ చేరుకుంటుంది.
ప్రయాణికుల ఆధరాభిమాణాలతో ఈ యాత్ర బస్సులు విజయవంతమ్ అగుచుండడంతో ఈ నెల 30 వ తేదీ రోజు 6 జ్యోతిర్లింగాలు సోమనాధ్ ద్వారకా యాత్ర బస్సు వెళ్తుందని ఆ బస్సు భద్రమారుతి,ఎల్లోరా, గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, శని సిగ్నాపూర్, షిర్డీ,నాసిక్, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, నిష్కాలంకమహాదేవ్,సోమనాధ్ జ్యోతీర్లింగం ,ద్వారకా శ్రీ కృష్ణుడు ఏలిన రాజ్యం, నాగనాగేశ్వర జ్యోతీర్లింగం, ఉజ్జాయిని జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్ జ్యోతీర్లింగం మొదలగు వుణ్యక్షేత్రాల దర్శనాలు ఉంటాయని ఆసక్తి కల వారు ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని డిపోమేనేజర్ తెలిపారు.మరిన్ని వివరాలకు. 9959226003, 9440018549 లో సంప్రదించాలని తను తెలిపారు.