BREAKING
కూటమి అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు విసృత ప్రచారం డిప్యూటీ మేయర్ గోపినాథ్‌కు బీజేపీ నాయకుల అభినందనలు మాగుంట శ్రీనివాసులురెడ్డి ని కలిసిన ప్రకాశం జిల్లా నూతన ZP చైర్మన్ కొక్కిలిగడ్డ ప్రభాకర్ రావు వైభవంగా పలమనేరు పురపాలక పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా పలమనేరు పురపాలక పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా పలమనేరు పురపాలక పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం 5,000/- ఆర్థిక సహాయం నిత్యావసర సరుకులను అందించిన........ పీపుల్స్ వెల్ఫేర్ సర్వీస్ సంస్థ అధ్యక్షులు గూడవల్లి గంగాధర్ జిల్లా న్యూక్లియర్ మెడికల్ అధికారి గా అధికారిగా డాక్టర్ వెంకటేశ్వర నాయక్ శ్రీవిష్ణు ఫ్యామిలీ ప్యాక్ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న ఫుల్ ఫన్ ఎంటర్‌టైనర్ థాయ్ లాండ్ అంబాసిడర్ చవనార్ట్ థాంగుసుమ్ ఫంట్‌ను కోరిన‌ మంత్రి లోకేష్ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అరుణాచల గిరిప్రదక్షిణకు నిర్మల్ డిపోనుండి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు : డిపోమేనేజర్ కల్పన. : రాయదుర్గం వైస్ చైర్మన్ ఏ వన్ మహబూబ్ భాషాకు ఘన సన్మానం!! పంచాయతీ ఎన్నికలు – రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కలినిన్‌గ్రాడ్‌కు సరఫరాల భద్రత కోసం కొత్త నౌకల నిర్మాణం కాళీ ఖేతీ రివ్యూ.. గ్రామీణ హారర్ డ్రామాతో భయపెట్టారా.. మెప్పించారా

గంగవరంలో ప్రతిష్ఠా కార్యక్రమాలు ప్రారంభం

Select Suryaa Now
గంగవరంలో ప్రతిష్ఠా కార్యక్రమాలు ప్రారంభం

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు మండలంలోని గంగవరం గ్రామంలో శ్రీ గంగా పార్వతి సమేత భీమలింగేశ్వర స్వామి, శ్రీ వీరభద్ర స్వామి, శ్రీ గణపతి స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ అయ్యప్ప స్వామి, నవగ్రహ దేవతలు మరియు ఇతర దేవతా మూర్తులు, యంత్రాలు మరియు ధ్వజ స్తంభముల ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 27వ తేదీ వరకు ప్రతిష్ఠా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 6.30 నుండి గంగపూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యయి. అనంతరం మృత్సంగ్రహణం, గోపూజ, ఆలయ ప్రవేశం, గణపతి పూజ, గౌరి పూజ, శైవ పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశనం, ఋత్విక్‌ వరణం, యాగశాల ప్రవేశం, హారతి, తీర్ధప్రసాద వితరణ, సాయంత్రం 6.15 నుండి టి.టి.డి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల బృందంచే ఆధ్యాత్మిక సంగీత కచేరి, సీతా విజయేశ్వరీ పరివార్‌ రమా సుందరి అమ్మ అద్దంకి వారిచే ఆధ్యాత్మిక ప్రవచనామృతం 24న గణపతి పూజ, నవగ్రహ-వాస్తు పూజ, మంటప దేవతా కలశ స్థాపన, చతుష్షష్టి యోగినీ దేవతా పూజ, చతుర్లింగ మండల పూజ, ప్రధాన కలశ స్థాపన, హారతి, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం 3.3. నుండి అగ్ని ప్రతిష్ట, లక్ష్మీ గణపతి హోమం, వాస్తు హోమం, నూతన యంత్ర విగ్రహములకు పంచగవ్య పంచామృత అభిషేకములు, హారతి, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం 4.30 నుండి దేవతామూర్తుల గ్రామోత్సవం, జలాధివాసం, హారతి, తీర్థప్రసాద వితరణ, సాయంత్రం 6.15 నుండి టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారుల బృందంచే ఆధ్యాత్మిక సంగీత కచేరి, రాత్రి 7.30 నుండి సీతా విజయేశ్వరీ పరివార్‌ రమా సుందరి అమ్మ అద్దంకి వారిచే ఆధ్యాత్మిక ప్రవచనామృతం, శాస్త్రీయ నృత రూపకాలు, వంటి కార్యక్రమాలు నిర్వహించారు. 27వ తేదీ ఉదయం 8.05 నుండి 9.05 నిలకు యంత్ర, నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు అనంతరం అన్నదానం కార్యక్రమలు జరుగుతాయన్నారు. ప్రతిష్ఠా కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 
సూర్య రిపోర్టర్ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.