BREAKING
ఐసీఎంఆర్ సంపద సర్వే.. వివిధ వయసు వర్గాల్లో తగ్గిన రక్తహీనత గంగవరంలో ప్రతిష్ఠా కార్యక్రమాలు ప్రారంభం కోబాల్ట్ ఎగుమతులపై కాంగో మరోసారి నిషేధం పంచాయతీ సీజన్ 5 ట్రైలర్ విడుదల.. ఫులేరాలో మారిన అధికారం, కొత్త డ్రామా గత వారం పతనంతో షేర్లలో కొనుగోలు అవకాశం కార్యకర్తలకు అండగా ఉంటాం..మల్లాంలోనే ఉంటాం..శేషు రెడ్డి ఆశయాలను కొనసాగిస్తాం! అన్నను కోల్పోయిన బాధ వర్ణనాతీతం..కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు దువ్వూరు రామ రాఘవరెడ్డి (కస్తూరి రెడ్డి)స్పష్టీకరణ అందం అంటే పుట్టుకతో వచ్చేదా లేక మనమే మలుచుకునేదా.. సద్గురుతో తమన్నా ఆసక్తికర చర్చ కూటమి ప్రభుత్వ హయాంలో ఓర్వకల్లులో అభివృద్ధి పరుగులు! చైనా-ఈయూ అధికారుల మారకపు రేట్ల చర్చలు చోర్ నికల్ కే భాగా 2 రిలీజ్ డేట్ ఖరారు.. నెట్‌ఫ్లిక్స్‌లోకి డిసెంబర్ 17న !గ్రామ సమస్యలపై ఆరా.. అభివృద్ధికి హామీ: సామన్నగారి రాము అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి తజికిస్తాన్ వైదొలిగే నిర్ణయం.. 2027లో అమల్లోకి జన్మదినం నాడే కౌన్సిలర్ గా పదవీ బాధ్యతలు.. అద్దంకిలో కౌన్సిలర్ చిన్ని మానసకు అభినందనల వెల్లువ. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అధికారికంగా బాధ్యతలు స్వీకరణ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి* *ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి – పెండింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి* *రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్*

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి* *ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి – పెండింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి* *రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్*

Select Suryaa Now
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి*  *ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి – పెండింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి*  *రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్*

 

కర్నూలు, నవంబర్ 23:ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

సోమవారం విజయవాడ నుండి  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సర్ అంశంపై కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు..

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల ముద్రణ ప్రక్రియ దాదాపు అన్ని జిల్లాల్లో పూర్తయిందని, ప్రస్తుతం పంపిణీ, సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని తెలిపారు. నవంబర్ 30లోగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ 10లోగా అందిన ఫారాల పరిశీలన, పరిష్కారం పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ 15లోగా పెండింగ్ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిష్కరించాలన్నారు. డిసెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురించాలన్నారు..

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి జిల్లాలో జరుగుతున్న సర్ ప్రక్రియ గురించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరిస్తూ ఎన్యుమరేషన్  ఫారాల జనరేషన్, ప్రింటింగ్ ప్రక్రియ పూర్తయిందని, ఫారాల పంపిణీ కూడా ప్రారంభమైందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు 20,400 ఫారాలను పంపిణీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. మంగళవారంలోగా ఫారాల పంపిణీతో పాటు తిరిగి సేకరణ ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని, అనంతరం 4 నుంచి 5 రోజుల్లో సేకరించిన ఫారాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.. ఫారం-6, ఫారం-7, ఫారం-8లలో అధికంగా భావి ఓటర్లకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయని, మిగిలిన అన్ని ఫారాలను నిర్దేశిత గడువులోగా పరిష్కరిస్తామని తెలిపారు. అదే విధంగా పెండింగ్‌లో ఉన్న 15 బుక్ ఏ కాల్స్‌ను రానున్న రెండు రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ వివరించారు.


వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, తదితరులు పాల్గొన్నారు.