సూర్య కరీంనగర్ : పోలీస్ శిక్షణలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ క్షేత్రస్థాయి విధులపై ప్రత్యక్ష అనుభవం పొందాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ ట్రైనీ డీఎస్పీలకు సూచించారు. పోలీసింగ్ అంటే నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు భరోసా కల్పించడం, చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, బాధ్యతాయుతంగా ప్రజాసేవ చేయడమని పేర్కొన్నారు.ప్రాక్టికల్ శిక్షణ కోసం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు కేటాయించిన ట్రైనీ డీఎస్పీలు సోమవారం సీపీని కలిసి రిపోర్ట్ చేశారు. 2026 నవంబర్ 23 నుంచి 2027 మే 9 వరకు కొనసాగనున్న శిక్షణలో పోలీస్ స్టేషన్ల నిర్వహణ, కేసుల దర్యాప్తు, నేరాల నియంత్రణ, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.శిక్షణలో సీనియర్ అధికారుల అనుభవాలను తెలుసుకుంటూ నాయకత్వ లక్షణాలు, నిర్ణయాత్మక సామర్థ్యం, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించి సమర్థవంతమైన అధికారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ట్రైనీ డీఎస్పీలు యెల్లబోయిన రుచిత, కొతురి ప్రణీత్, మహేష్ రెడ్డి పైళ్ల, నిశాంత్ పి.ఎం. శిక్షణకు హాజరయ్యారు.