BREAKING
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి యువనేత గంగుల ఫణి కృష్ణారెడ్డి ఆర్థిక సహాయం ఫాంటసీ థ్రిల్లర్ మాయన్‌తో రాబోతున్న జయసూర్య.. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల రూపేష్ గుప్తా గెలుపునకు ముస్లిం సోదరులు సహకరించాలి – కూటమి నేతల పిలుపు రామాయణ కోసం 10 నుంచి 12 సినిమాలు వదులుకున్నా.. ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు బియ్యం విక్రయాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి – అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా నిల్వ చేసినా చర్యలు తప్పవు* *బియ్యం ధరల నియంత్రణకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, నిరంతరం తనిఖీలు చేపట్టాలి* *ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి* *జిల్లా మిస్ యూనివర్స్ 2026 పోటీల్లో కేరళ అమ్మాయి కజియా లిజ్ మేజో.. భారత్ తరఫున సందడి గ్రానైట్ అక్రమాలు, NLM అవినీతిపై కేంద్ర సంస్థల విచారణ చేపట్టాలి - AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ అనిరుధ్, కావ్యా మారన్ రిసెప్షన్‌లో రజనీకాంత్, అజిత్, ధోనీ సందడి.. తారల పండుగలా వేడుక హంటింగ్టన్స్ వ్యాధి చికిత్స పరిశోధనలో ఎలీ లిల్లీ కీలక ముందడుగు గడువులోగా వైద్య కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలి - వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు ఆల్ఫోర్స్ పాఠశాలలో  గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి వేడుకలు.. మాజీ విప్ గంగులను కలిసిన నూతన వైకాపా కౌన్సిలర్లు ట్రైనీ డీఎస్పీలకు సీపీ గౌష్ ఆలం దిశానిర్దేశం ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-19 స్విమ్మింగ్ ఎంపిక పోటీలు. సోషలిస్టులు పుంజుకుంటున్నా మితవాద కూటమికే ఆధిక్యం

గడువులోగా వైద్య కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలి - వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు

Select Suryaa Now
గడువులోగా వైద్య కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలి - వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు
సూర్య కరీంనగర్ ప్రతినిధి : ప్రభుత్వ వైద్య కళాశాలలు, అనుబంధ హాస్టళ్ల నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. వైద్య, నర్సింగ్ కళాశాలల నిర్మాణాలు ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.సోమవారం హైదరాబాద్ సచివాలయంలో కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ జిల్లాల వైద్యారోగ్య శాఖ ప్రగతిపై నిర్వహించిన సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా, ఇతర జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల బాలికల హాస్టల్ నిర్మాణాన్ని నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేసి అప్పగించాలని, అవసరమైన వసతులు కల్పించి డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. బాలుర హాస్టల్ నిర్మాణాన్ని డిసెంబర్ చివరికి, ప్రధాన కళాశాల భవనాన్ని మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని, విద్యార్థులకు అదనపు బస్సు సౌకర్యాలు, బల్క్ వాటర్ సరఫరా, విద్యుత్ సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని తెలిపారు.నాలుగు జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, మాతా శిశు ఆరోగ్యం, టీబీ నిర్మూలన, డెంగ్యూ, మలేరియా నివారణ చర్యలు, ఆసుపత్రుల అభివృద్ధి పనులపై సమీక్షించారు. వైద్య సేవల నాణ్యత పెంపునకు శాఖల మధ్య సమన్వయం అవసరమని మంత్రి పేర్కొన్నారు.సమీక్షలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఆర్ అండ్ బీ అధికారులు, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తఖీయూద్దీన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.