మహిళల మధ్య ఘర్షణ.
నవాబుపేట సూర్య న్యూస్:
మహిళల మధ్య జరిగిన ఘర్షణలో బంగారు ఆభరణాలు కిందపడిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది.మండలంలోని చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన జాజిలి ఆశమ్మ(30) సెప్టెంబర్ 26న తన ఇంటి సమీపంలోని రోడ్డుపై జొన్నలు తూర్పు పడుతుండగా,ఆమె పాలివారైన జాజిలి లక్ష్మమ్మ నానా బూతులు తిడుతూ దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది.ఈ క్రమంలో ఆశమ్మ మెడలోని బంగారు గుండ్ల దండ కిందపడింది.అక్కడికి వచ్చిన ఆశమ్మ తల్లి బడుగుల సత్యమ్మ గొడవను అడ్డుకునే ప్రయత్నం చేయగా,లక్ష్మమ్మ ఆమెపై కూడా దాడికి దిగినట్లు తెలిపింది.దీంతో సత్యమ్మ మెడలో ఉన్న బంగారు పట్టీలు సైతం కిందపడినట్లు పేర్కొంది.ఈ విషయాన్ని గమనించిన లక్ష్మమ్మ భర్త అంజయ్య అక్కడికి చేరుకుని ఆశమ్మ,సత్యమ్మలను దూషించినట్లు ఫిర్యాదులో వివరించింది.ఈ వివాదాన్ని గ్రామ పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటామని చెప్పినప్పటికీ నేటికీ మాట్లాడకపోవడంతో ఆశమ్మ సోమవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేందర్ తెలిపారు.