సిద్ధుగాడి లవ్ స్టోరీ విడుదల తేదీ ఖరారు.. నవంబర్ 27న థియేటర్లలోకి
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: యువ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన సిద్ధుగాడి లవ్ స్టోరీ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ఖరారు చేసింది. శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం నవంబర్ 27, 2026న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, సంఘర్షణతో పాటు కామెడీ అంశాలను మేళవించి ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ అనుభూతిని అందించేలా ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రానికి రమేష్ బాబు చెరుకూరి దర్శకత్వం వహించారు. అమెరికాలో స్థిరపడి ఉద్యోగం చేస్తూనే, తెలుగు సినిమాపై ఉన్న మక్కువతో ఆయన ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంతో తన ఆలోచనలు, అనుభవాలను రంగరించి ఈ ప్రేమకథను రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.
ఈ సినిమాలో మనోజ్ హీరోగా నటిస్తుండగా, శృతి, మోహన సిద్ధి హీరోయిన్లుగా కనిపించనున్నారు. సీనియర్ నటుడు సుమన్ హీరో తండ్రి పాత్రలో నటించగా, సర్కార్ విలన్ పాత్రలో కనిపిస్తారు. వీరితో పాటు చిత్రం శ్రీను, జబర్దస్త్ అప్పారావు వంటి హాస్యనటులు కీలక పాత్రల్లో నటిస్తూ వినోదాన్ని పంచనున్నారు. సావిత్రమ్మ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించగా, బాల బ్రహ్మచారి, శివ బ్రహ్మిణి చెరుకూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దొసడ యాదగిరి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా, సీఎన్ ఆదిత్య సంగీతం అందించారు. లక్కీ ఎక్కరి ఎడిటర్‌గా, తూఫాన్ ఫైట్ మాస్టర్‌గా పనిచేశారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయిన నేపథ్యంలో నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.
Also Read: నివేదా థామస్ శ్రీమతి ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 4న ఓటీటీలోకి వచ్చేస్తోంది