సూర్య కరీంనగర్ : కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి టి.గౌతమ్ జాతీయస్థాయి డాడ్జ్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. జగిత్యాలలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్రస్థాయి డాడ్జ్‌బాల్ పోటీల్లో సబ్ జూనియర్స్ విభాగంలో ప్రతిభ కనబరిచి, డిసెంబర్ 26, 27 తేదీల్లో జమ్మూ కాశ్మీర్‌లో జరిగే జాతీయ పోటీలకు అర్హత సాధించాడు.ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి విద్యార్థిని అభినందించి, జాతీయస్థాయిలోనూ పతకాలు సాధించి తెలంగాణ కీర్తిని చాటాలని ఆకాంక్షించారు. డాడ్జ్‌బాల్ క్రీడతో వేగం, చురుకుదనం, ఏకాగ్రత, నిర్ణయాత్మక సామర్థ్యం పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.