BREAKING
రూపేష్ గుప్తా గెలుపునకు ముస్లిం సోదరులు సహకరించాలి – కూటమి నేతల పిలుపు రామాయణ కోసం 10 నుంచి 12 సినిమాలు వదులుకున్నా.. ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు బియ్యం విక్రయాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి – అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా నిల్వ చేసినా చర్యలు తప్పవు* *బియ్యం ధరల నియంత్రణకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, నిరంతరం తనిఖీలు చేపట్టాలి* *ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి* *జిల్లా మిస్ యూనివర్స్ 2026 పోటీల్లో కేరళ అమ్మాయి కజియా లిజ్ మేజో.. భారత్ తరఫున సందడి గ్రానైట్ అక్రమాలు, NLM అవినీతిపై కేంద్ర సంస్థల విచారణ చేపట్టాలి - AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ అనిరుధ్, కావ్యా మారన్ రిసెప్షన్‌లో రజనీకాంత్, అజిత్, ధోనీ సందడి.. తారల పండుగలా వేడుక హంటింగ్టన్స్ వ్యాధి చికిత్స పరిశోధనలో ఎలీ లిల్లీ కీలక ముందడుగు గడువులోగా వైద్య కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలి - వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు ఆల్ఫోర్స్ పాఠశాలలో  గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి వేడుకలు.. మాజీ విప్ గంగులను కలిసిన నూతన వైకాపా కౌన్సిలర్లు ట్రైనీ డీఎస్పీలకు సీపీ గౌష్ ఆలం దిశానిర్దేశం ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-19 స్విమ్మింగ్ ఎంపిక పోటీలు. సోషలిస్టులు పుంజుకుంటున్నా మితవాద కూటమికే ఆధిక్యం అల్ఫోర్స్ విద్యార్థి జాతీయస్థాయి డాడ్జ్‌బాల్ పోటీలకు ఎంపిక సిద్ధుగాడి లవ్ స్టోరీ విడుదల తేదీ ఖరారు.. నవంబర్ 27న థియేటర్లలోకి

ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-19 స్విమ్మింగ్ ఎంపిక పోటీలు.

Select Suryaa Now
ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-19 స్విమ్మింగ్ ఎంపిక పోటీలు.
సూర్య కరీంనగర్ : జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-19 స్విమ్మింగ్ ఎంపిక పోటీలు విజయవంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫోన్స్ ఉన్నత పాఠశాల, జ్యోతినగర్, కరీంనగర్‌లో బాలబాలికల విభాగాల్లో ఈ పోటీలను నిర్వహించారు.ఈ పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ పోటీలను సెయింట్ ఆల్ఫోన్స్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫాదర్ సంతోష్ కుమార్, జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఎల్. బన్సీలాల్ క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఎస్‌జీఎఫ్ క్రీడలు ఎంతో ముఖ్యమైనవని తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేసి రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ పోటీల నిర్వహణలో పీడీలు అశోక్, విష్ణువర్ధన్, రాజశేఖర్, నరేష్, రాజు, శ్రీనివాస్, కోచ్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.