telangana
బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైన పారమిత విద్యార్థిని
సూర్య కరీంనగర్ : తెలంగాణ పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించనున్న యస్.జి.ఎఫ్.ఐ. 70వ తెలంగాణ బ్యాడ్మింటన్ అండర్-17 పోటీలకు పద్మనగర్‌లోని పారమిత హెరిటేజ్ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని జి. అతిధి వైశాలి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ తెలిపారు. ఈ నెల 26 నుండి 28 వరకు సంగారెడ్డి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనబోతోంది. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని ని పాఠశాల చైర్మన్ డా. ఇ. ప్రసాదరావుతో పాటు డైరెక్టర్లు ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, రాకేశ్, వి.యు.యం. ప్రసాద్, వినోద్ రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కె. హన్మంతరావు, ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ, సమన్వయకర్తలు రబీంద్రపాత్రో, నాగరాజు, రాము, వ్యాయామ ఉపాధ్యాయులు రాజు, యం.డి. జునైద్ పాల్గొన్నారు.