రూపేష్ గుప్తా గెలుపునకు ముస్లిం సోదరులు సహకరించాలి – కూటమి నేతల పిలుపు
నరసరావుపేట : ముస్లిం మైనారిటీల అభిప్రాయాలు, ఆకాంక్షలను తెలుసుకుంటూ అన్ని వర్గాల సంక్షేమం, పట్టణ సమగ్ర అభివృద్ధి, సామాజిక ఐక్యతే లక్ష్యంగా కూటమి నాయకులు ముందుకు సాగుతున్నారని గుంటూరు పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయులు పేర్కొన్నారు. నరసరావుపేటలోని నవయుగ కన్వెన్షన్‌లో సోమవారం ముస్లిం సోదరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవ రాయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బలపరిచిన నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నాగసరపు రూపేష్ గుప్తాను ప్రజలందరూ ఆదరించి గెలిపించాలని కోరారు. యువ నాయకుడిగా పట్టణ అభివృద్ధిపై స్పష్టమైన ఆలోచనలున్న వ్యక్తిగా రూపేష్ గుప్తా నరసరావుపేట అభివృద్ధికి తనవంతు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణంలో నెలకొన్న సమస్యలను గుర్తించి, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఆయనకు అవకాశం కల్పించాలని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. నరసరావుపేట అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి అభ్యర్థికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా తనయుడైన రూపేష్ గుప్తా యువ నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. యువతకు రాజకీయాల్లో ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగా రూపేష్ గుప్తాను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు కూటమి అభ్యర్థికి తమ మద్దతు తెలియజేసి విజయానికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహమ్మద్, నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నాగసరపు రూపేష్ గుప్తా, షేక్ మీరవలి, షరీఫ్, గారోఫ్, నల్లపాటి రాము తదితర నాయకులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో నాయకులు ఆత్మీయంగా మమేకమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.
మల్లికార్జున రావు పల్నాడు జిల్లా ఇన్చార్జి…