అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి యువనేత గంగుల ఫణి కృష్ణారెడ్డి ఆర్థిక సహాయం
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి గంగుల ఫణి కృష్ణారెడ్డి ఆర్థిక సాయం
--కష్టకాలంలో ఆదుకున్న యువ నేతకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీమన్నారాయణ
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్;అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీమన్నారాయణకు యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.
*సమస్య చెప్పిన వెంటనే స్పందన*
గంగుల కుటుంబ అభిమాని అయిన శ్రీమన్నారాయణ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. వైద్య ఖర్చులు, కుటుంబ పోషణ భారంగా మారడంతో ఆయన గంగుల ఫణి కృష్ణారెడ్డిని కలిసి తన పరిస్థితిని వివరించారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన ఫణి కృష్ణారెడ్డి, శ్రీమన్నారాయణకు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
అండగా ఉంటామని భరోసా
ఈ సందర్భంగా ఆయన శ్రీమన్నారాయణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా గంగుల కుటుంబం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అండగా నిలుస్తుందని ఆయనకు ధైర్యం చెప్పారు. ఆపద సమయంలో స్పందించి ఆర్థిక సాయం అందించిన గంగుల ఫణి కృష్ణారెడ్డికి శ్రీమన్నారాయణ, ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.