చీపురుపల్లి మండలంలో సర్పంచ్ లకు 102, వార్డులకు 596 నామినేషన్లు
చీపురుపల్లి మేజర్ న్యూస్:
చీపురుపల్లి మండలంలో 19 పంచాయతీ ల సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు మూడో రోజు నామినేషన్ల స్వీకరణ గడువు సోమవారంతో ముగిసింది. సర్పంచ్ పదవికి మండలంలో 102, వార్డు సభ్యులకు 596 నామినేషన్లు వచ్చాయి. తొలిరోజు సర్పంచ్ పదవికి 23, రెండో రోజు 52, మూడో రోజు 27 నామినేషన్లు వచ్చాయి. మూడురోజులకు గాను సర్పంచ్ పదవికి 102 నామినేషన్లు రాగా, వార్డు సభ్యులకు 596 నామినేషన్లు వచ్చాయి. చీపురుపల్లిలో సర్పంచ్ పదవికి టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలతో కలిపి 11 నామినేషన్లు వచ్చాయి. 20 వార్డులకు 73 నామినేషన్లు వచ్చాయి. పంచాయతీల వారీగా అలజంగి 4 సర్పంచ్, వార్డులకు 30, చిన్ననడిపల్లి సర్పంచ్ కి 5, వార్డులకు 24, దేవరపోదిలంలో సర్పంచ్ 4, 24 వార్డులకు, గొల్లలపాలెంలో సర్పంచ్ 5, వార్డులకు 32, గొల్లలములగాం సర్పంచ్ 8, వార్డులకు 33, ఇటకర్లపల్లి సర్పంచ్ 4, వార్డులకు 16, కరకాం సర్పంచ్ 5, వార్డులకు 41, కర్లంలో 5 సర్పంచ్ కి, వార్డులకు 25, మెట్టపల్లి 4, వార్డులకు 25, నిమ్మలవలస 5, వార్డులకు 37, పీకే పాలవలస 7 సర్పంచ్ కి, వార్డులకు 50 నామినేషన్లు వచ్చాయి. పర్ల 6, వార్డులకు 21, పత్తికాయవలస 4, వార్డులకు 30, పెదనడిపల్లి 3, వార్డులకు 27, పేరిపి 4, వార్డులకు 25, రామలింగాపురం పంచాయతీకి 7, వార్డులకు 19, పుర్రేయవలస 5 సర్పంచ్ కి, వార్డులకు 14, రావివలస ఆరు సర్పంచ్ కి వార్డులకు 50 నామినేషన్లు దాఖలవ్వగా మొత్తం మూడు రోజులకు ఆయా గ్రామాల సర్పంచ్ పదవికి 102 నామినేషన్లు వచ్చాయి. వార్డు సభ్యులకు గాను మండలంలో అన్ని పంచాయతీలకు నామినేషన్లు గడువు ముగిసిన సమయానికి 596 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు వేసారు.
రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా