పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పీవోలకు శిక్షణ!
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పీవోలకు శిక్షణ!
- శిక్షణ కార్యక్రమానికి 124 మంది పోలింగ్ అధికారులు హాజరు
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
మూడో విడతలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ అధికారులకు సోమవారం మండల కేంద్రంలోని పొదుపు లక్ష్మి భవనంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఎంపీడీవో నాగ అనసూయ తెలిపారు.
ఈ కార్యక్రమానికి మొత్తం 124 మంది పోలింగ్ అధికారులు (పీవోలు) హాజరైనట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల నిర్వహణ, పోలింగ్ ప్రక్రియ, విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల నిబంధనలపై అధికారులకు శిక్షణ అందించినట్లు ఎంపీడీవో వివరించారు.