మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ అభినందనలు
గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కోవెలమూడి లక్ష్మీ అపర్ణకి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి అభినందించారు. నగర సమగ్రాభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గుంటూరు అభ్యున్నతి దిశగా మేయర్‌గా ఆమె చేపట్టబోయే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావాలని డేగల ప్రభాకర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ కాసుల సాయి రాజశేఖర్, డాక్టర్ గోపి తదితరులు పాల్గొని నూతన మేయర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
సూర్య నాయక్