ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా!
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
మీ ఇంటి బిడ్డగా ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని నన్నూరు సర్పంచ్ అభ్యర్థి రూపవాణి కోరారు. సోమవారం గ్రామంలోని 5, 7, 10వ వార్డులతో పాటు చింతకాయలగేరి, మంగళగేరి, ఎస్సీ కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల్లో విజయం సాధించి సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ నన్నూరును అభివృద్ధి పథంలో నడిపిస్తానని పేర్కొన్నారు. తనకు ఒక్క అవకాశం కల్పించి ఆదరించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.