BREAKING
!గ్రామ సమస్యలపై ఆరా.. అభివృద్ధికి హామీ: సామన్నగారి రాము అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి తజికిస్తాన్ వైదొలిగే నిర్ణయం.. 2027లో అమల్లోకి జన్మదినం నాడే కౌన్సిలర్ గా పదవీ బాధ్యతలు.. అద్దంకిలో కౌన్సిలర్ చిన్ని మానసకు అభినందనల వెల్లువ. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అధికారికంగా బాధ్యతలు స్వీకరణ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి* *ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి – పెండింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి* *రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్* స్పెయిన్ సార్వత్రిక ఎన్నికల సర్వేలు చోడవరం కూటమి సర్పంచ్ అభ్యర్థి పెదబాబు ఎమ్మెల్యే రాజు ప్రకటన వెల్దుర్తిలో ఘనంగా సత్యసాయి బాబా 101వ జయంతోత్సవాలు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పీవోలకు శిక్షణ! మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ అభినందనలు పట్టణ అభివృద్ధి నా ధ్యేయం యువ చైర్మన్ నాగసారపు రూపేష్ గుప్తా పలు వార్డుల్లో నగసరపు రూపేష్ గుప్తా, రాందేవ్ గుప్తా విస్తృత ప్రచారం ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా. షేక్ ఆజాద్ 26 వార్డు కౌన్సిలర్ కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను సకాలంలో ఖర్చు చేయాలి* *రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి* *ఎరువుల బుకింగ్‌కు సంబంధించి ఎఫ్.ఎఫ్.ఎస్ యాప్‌పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి* *రైతులకు సంబంధించిన ఫార్మర్ ఐడీల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* నిర్మల్‌లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు వాహనాల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ విధులు నిర్వహించాలి: ఎస్పీ జానకి షర్మిల : ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

టీ20 క్రికెట్‌లో 15 వేల పరుగుల మైలురాయి.. జోస్ బట్లర్ రికార్డుకు చేరువలో కీరన్ పొలార్డ్

Select Suryaa Now
టీ20 క్రికెట్‌లో 15 వేల పరుగుల మైలురాయి.. జోస్ బట్లర్ రికార్డుకు చేరువలో కీరన్ పొలార్డ్

సూర్య స్పోర్ట్స్ డెస్క్: వెస్టిండీస్ విధ్వంసక ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ పొట్టి క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించారు. టీ20 ఫార్మాట్‌లో 15 వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో బ్యాటర్‌గా చరిత్రకెక్కారు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 2026-27 సీజన్‌లో భాగంగా నవంబర్ 21న దుబాయ్ వేదికగా డెజర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ కెప్టెన్ పొలార్డ్ ఈ రికార్డును నెలకొల్పారు. ఆ మ్యాచ్‌కు ముందు ఆయన ఖాతాలో 14,999 పరుగులు ఉండగా, బ్యాటింగ్‌కు దిగిన తొలి పరుగుతోనే 15 వేల క్లబ్‌లోకి అడుగుపెట్టారు. ఆ పోరులో 15 బంతుల్లో 15 పరుగులు చేసిన పొలార్డ్ మొత్తం టీ20 పరుగులను 15,014కు చేర్చారు. ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగానూ ఆయన ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు.

ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగుల జాబితాలో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ 15,062 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, పొలార్డ్ 15,014 పరుగులతో రెండో స్థానంలో నిలిచారు. వీరిద్దరి మధ్య వ్యత్యాసం కేవలం 48 పరుగులే కావడం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. బట్లర్‌ను సమం చేయాలంటే పొలార్డ్ మరో 48 పరుగులు చేయాలి, అధిగమించి నంబర్ వన్ స్థానానికి చేరుకోవాలంటే 49 పరుగులు అవసరం. నవంబర్ 24న గల్ఫ్ జెయింట్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం పొలార్డ్‌కు ఉంది.

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ బ్యాటర్ల జాబితాలో బట్లర్, పొలార్డ్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా, ఆ తర్వాత అలెక్స్ హేల్స్ 14,581 పరుగులు, క్రిస్ గేల్ 14,562 పరుగులు, డేవిడ్ వార్నర్ 14,411 పరుగులతో వరుస స్థానాల్లో ఉన్నారు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 14,218 పరుగులతో జేమ్స్ విన్స్‌తో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో ఉండగా, షోయబ్ మాలిక్, క్వింటన్ డికాక్, ఫాఫ్ డుప్లెసిస్ కూడా టాప్ జాబితాలో ఉన్నారు.

ఇప్పటివరకు 755 టీ20 మ్యాచ్‌లు ఆడి 672 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన పొలార్డ్, 31.67 సగటు, 150.84 స్ట్రైక్ రేట్‌తో 15,014 పరుగులు సాధించారు. ఇందులో రెండు సెంచరీలు, 71 అర్ధసెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ రాణించిన ఆయన 436 ఇన్నింగ్స్‌లలో 341 వికెట్లు పడగొట్టారు. అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గానూ నిలిచిన పొలార్డ్ సారథ్యంలో ఎంఐ ఎమిరేట్స్ తొలి మ్యాచ్‌లో 174 పరుగులు చేసి ఘన విజయం సాధించడం విశేషం.