BREAKING
కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం. టీ20 క్రికెట్‌లో 15 వేల పరుగుల మైలురాయి.. జోస్ బట్లర్ రికార్డుకు చేరువలో కీరన్ పొలార్డ్ సినిమాలో నేపథ్య సంగీతం భోజనంలో ఉప్పులాంటిది.. ఆసక్తికర విషయాలు పంచుకున్న డాన్ విన్సెంట్ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి యువనేత గంగుల ఫణి కృష్ణారెడ్డి ఆర్థిక సహాయం ఫాంటసీ థ్రిల్లర్ మాయన్‌తో రాబోతున్న జయసూర్య.. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల రూపేష్ గుప్తా గెలుపునకు ముస్లిం సోదరులు సహకరించాలి – కూటమి నేతల పిలుపు రామాయణ కోసం 10 నుంచి 12 సినిమాలు వదులుకున్నా.. ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు బియ్యం విక్రయాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి – అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా నిల్వ చేసినా చర్యలు తప్పవు* *బియ్యం ధరల నియంత్రణకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, నిరంతరం తనిఖీలు చేపట్టాలి* *ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి* *జిల్లా మిస్ యూనివర్స్ 2026 పోటీల్లో కేరళ అమ్మాయి కజియా లిజ్ మేజో.. భారత్ తరఫున సందడి గ్రానైట్ అక్రమాలు, NLM అవినీతిపై కేంద్ర సంస్థల విచారణ చేపట్టాలి - AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ అనిరుధ్, కావ్యా మారన్ రిసెప్షన్‌లో రజనీకాంత్, అజిత్, ధోనీ సందడి.. తారల పండుగలా వేడుక హంటింగ్టన్స్ వ్యాధి చికిత్స పరిశోధనలో ఎలీ లిల్లీ కీలక ముందడుగు గడువులోగా వైద్య కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలి - వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు ఆల్ఫోర్స్ పాఠశాలలో  గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి వేడుకలు.. మాజీ విప్ గంగులను కలిసిన నూతన వైకాపా కౌన్సిలర్లు

బియ్యం విక్రయాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి – అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా నిల్వ చేసినా చర్యలు తప్పవు* *బియ్యం ధరల నియంత్రణకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, నిరంతరం తనిఖీలు చేపట్టాలి* *ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి* *జిల్లా

Select Suryaa Now
బియ్యం విక్రయాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి – అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా నిల్వ చేసినా చర్యలు తప్పవు*  *బియ్యం ధరల నియంత్రణకు ఆర్డీఓలు, తహసీల్దార్లు,  నిరంతరం తనిఖీలు చేపట్టాలి*  *ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి*  *జిల్లా

 

కర్నూలు, నవంబర్ 23:- జిల్లాలో బియ్యం విక్రయాలపై ప్రభుత్వం నిర్దేశించిన ధరలను తప్పనిసరిగా అమలు చేయాలని, నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయించడం, అక్రమంగా నిల్వ చేయడం వంటి చర్యలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.

సోమవారం ఉదయం సర్ ప్రక్రియ, బియ్యం ధరల నియంత్రణ తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బియ్యం ధరల నియంత్రణకు సంబంధించి జిల్లాలోని అన్ని మండలాల్లో తహసీల్దార్లు, ఆర్డీఓలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా బియ్యం మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు అనుగుణంగా విక్రయాలు చేపట్టేలా పర్యవేక్షించాలన్నారు. ఈ విషయంలో ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కొత్తగా జారీ చేసిన సర్క్యులర్‌పై వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించాలని, బియ్యం సరఫరా, విక్రయాల వ్యవస్థలో భాగస్వాములైన మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు ఏడు రోజుల్లోగా జిల్లా పౌరసరఫరాల అధికారి వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.


సర్ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు సంబంధించి  ఫీల్డ్ స్థాయిలో బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఫారాలను పంపిణీ చేయడంతో పాటు, ఓటర్లు అందుబాటులో ఉన్న చోట వారి నుంచి తిరిగి ఫారాలను సేకరించాలని కలెక్టర్ తెలిపారు. ఓటర్లు అందుబాటులో లేని సందర్భాల్లో నిబంధనల ప్రకారం మొదటి, రెండో, మూడో విడతల్లో క్షేత్రస్థాయి సందర్శనలు నిర్వహించి, అనంతరం మాత్రమే నాన్ కలెక్టబుల్‌గా గుర్తించి డిజిటైజేషన్ చేయాలన్నారు. ఈ ప్రక్రియను నిర్ణీత గడువు అయిన నవంబర్ 30వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ఏఎస్డీడీ కేసుల పరిశీలన, పెండింగ్ క్లెయిమ్స్ పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశిత గడువులో పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్  సంబంధిత ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు.  ఏఎస్డీడీ కేటగిరీకి సంబంధించి బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఫారాలను పంపిణీ చేయడంతో పాటు, ఓటర్లు అందుబాటులో ఉన్నప్పుడు అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లను సేకరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏడు రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న ఫారాలను రెండు నుంచి నాలుగు రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. మిగిలిన పెండింగ్ ఫారాలను కూడా నిర్దేశిత గడువులో పూర్తి చేయాలన్నారు.

కర్నూలు, ఆదోని, పత్తికొండ సబ్ డివిజన్లలో పెండింగ్ లో ఉన్న 22-A దరఖాస్తులన్నింటినీ ఈ శనివారం నాటికి పరిష్కరించి, సంబంధిత అధికారుల లాగిన్లలో పెండింగ్ సంఖ్యను సున్నాకు తీసుకురావాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.


టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, ఆదోని ఆర్డీఓ అరుణ దేవి, తహసిల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.