BREAKING
ఏఐ స్టాక్స్‌లో మళ్లీ బుల్ ర్యాలీ..ఏఐ ట్రేడ్: కోర్‌వీవ్ 31%, మైక్రాన్ 17%, ఇంటెల్ 15% జంప్.. త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -ప్రమాణస్వీకారంలో 62వ డివిజన్ కార్పొరేటర్ బండారు పార్థసారధి వాల్ స్ట్రీట్‌లో చారిత్రాత్మక 'మాన్‌స్టర్ ర్యాలీ'..నాస్‌డాక్ 7.5%, డౌ జోన్స్ 1,500 పాయింట్ల జంప్.. చీపురుపల్లి మరింత అభివృద్ధికి సహకరిస్త : బొత్స 48 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆర్. పీ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాభివృద్ధికి బాటలు వేస్తా పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ మలయనూరులో టిడిపి ప్రచార రథం పై దాడి. ధ్వంసమైన బొలెరో వాహనం. సమన్వయంతో పనిచేస్తే గెలుపు: కిమిడి కళా వెంకట రావు సర్పంచ్ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు..సామగ్రిని సిద్ధం చేస్తున్న సిబ్బంది మున్సిపల్ వైస్ చైర్మన్ గా పప్పల మోహన్ కొలువు దీరిన పాలకొండ నగర పంచాయతీ పాలకవర్గం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన పోటీల విజేతలు పార్వతీపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు

నల్లబెల్లి మాజీ సర్పంచ్ గుండెపోటుతో మృతి.

Select Suryaa Now
నల్లబెల్లి మాజీ సర్పంచ్ గుండెపోటుతో మృతి.

మాజీ సర్పంచ్ పూనెం బాపనయ్య గుండెపోటుతో మృతి.

దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్):

మండల పరిధిలోని చిన్న నల్లబల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పూనెం బాపనయ్య శనివారం గుండెపోటు తో అకస్మాత్తుగా మృతి చెందారు.ఆయన మరణ వార్తతో చిన్న నల్లబల్లి గ్రామంలో విషాద శాయలు అలుముకున్నాయి.గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో బాపనయ్య గ గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా పార్టీ బలోపేతానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని స్థానిక నాయకులు కొనియాడారు.సర్పంచ్ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా గ్రామంలో ఎటువంటి గొడవలు,తగాదాలు వచ్చినా బాపనయ్య గారే ముందుండి పెద్దరికం చేసి ఇరువర్గాలకు సర్దిచెప్పి ఎవరికీ నష్టం జరగకుండా ఎన్నో కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చి ఆదర్శవంతమైన తీర్పులు చెప్పేవారని గ్రామ పెద్ద దిక్కుగా ఉండి అందరినీ కలుపుకెళ్లే ఆయన నాయకత్వాన్ని కోల్పోవడం గ్రామానికి తీరని లోటని గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.పూనెం బాపనయ్య మృతి పట్ల పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.నేడు చిన్ననల్లబల్లి కాలనీ వారి స్వగృహంలో అంత్యక్రియలు జరుగుతాయి.

దుమ్ముగూడెం సూర్య రిపోర్టర్ సుమన్.