ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాభివృద్ధికి బాటలు వేస్తా
- కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించండి
పామూరు, మేజర్ న్యూస్ : మండలంలోని
తూర్పు కోడిగుడ్లపాడు పంచాయతీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచానని మానం రాజేశ్వరి తెలిపారు. ప్రజలు తనపై నమ్మకంతో ఒక్క అవకాశం కల్పిస్తే గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని అన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. పంచాయతీ పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటానని భరోసా ఇచ్చారు. పదవిని హోదాగా కాకుండా ప్రజలకు సేవ చేసే అవకాశంగా భావిస్తానని తనను నమ్మి ఆదరించిన ప్రతి ఒక్కరి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. ఈ నెల 26న జరిగే పంచాయతీ ఎన్నికల్లో కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామానికి సేవ చేసే అవకాశం కల్పించాలని మానం రాజేశ్వరి ఓటర్లను అభ్యర్థించారు.