BREAKING
48 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆర్. పీ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాభివృద్ధికి బాటలు వేస్తా పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ మలయనూరులో టిడిపి ప్రచార రథం పై దాడి. ధ్వంసమైన బొలెరో వాహనం. సమన్వయంతో పనిచేస్తే గెలుపు: కిమిడి కళా వెంకట రావు సర్పంచ్ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు..సామగ్రిని సిద్ధం చేస్తున్న సిబ్బంది మున్సిపల్ వైస్ చైర్మన్ గా పప్పల మోహన్ కొలువు దీరిన పాలకొండ నగర పంచాయతీ పాలకవర్గం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన పోటీల విజేతలు పార్వతీపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత బాలభూపాల నాయుడు.. డిసెంబర్ 1, 2,3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి.... సిఐటియు పిలుపు. కార్పొరేషన్ ఎన్నికల్లో పచ్చ నోట్ల పందేరం..! ఆమదాలవలసలో టిడిపి ముమ్మర ప్రచారం

సమన్వయంతో పనిచేస్తే గెలుపు: కిమిడి కళా వెంకట రావు

Select Suryaa Now
సమన్వయంతో పనిచేస్తే గెలుపు: కిమిడి కళా వెంకట రావు

చీపురుపల్లి మేజర్ న్యూస్: కూటమి ఐక్యత, సమన్వయంతో పనిచేస్తే గెలుపు సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు పేర్కొన్నారు. స్థానిక తన కార్యాలయంలో ఆయన సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో 90 శాతానికి పైగా స్ట్రైక్ రేట్ సాధించామని, రానున్న ఎన్నికల్లోనూ 95 శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యంగా పనిచేయాలన్నారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులు తమ బల బలాలు, గెలుపు అవకాశాలను సమీక్షించుకుని, ఎక్కడ అవసరమైతే అక్కడ సర్దుబాటు చేసుకుని గెలిచే అభ్యర్థికి సహకరించాలన్నారు.  మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు చిన్న పెద్ద భేదం లేకుండా కలిసికట్టుగా పనిచేస్తూ ప్రతి స్థానాన్ని గెలిపించుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల్లో సానుకూలత ఉందని, పార్టీ గెలిస్తేనే భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు వంటి అవకాశాలు లభిస్తాయని కార్యకర్తలు గుర్తించాలన్నారు.  గతంలో ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పనిచేయడం వల్ల సుమారు 93 శాతానికి పైగా స్ట్రైక్ రేట్ వచ్చిందని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవనే భావనతో ఎవరికి వారే పరీక్షించుకునే ధోరణి కాకుండా, ఎవరికి గెలిచే అవకాశం ఉంటే వారికి సహకరిస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు.

టీడీపీ కూటమిలో ప్రధాన భాగంగా ఉన్నందున అందరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందని కళావెంకటరావు స్పష్టం చేశారు. వార్డులు, సర్పంచ్ స్థానాల్లో మిత్రపక్షాలకు ఒకటి రెండు ఎక్కువ ఇచ్చినా ఇబ్బంది లేదని, సర్దుబాటు ధోరణితో వ్యవహరించాలని తెలిపారు. ఎక్కడైనా విభేదాలు లేదా సమస్యలు తలెత్తితే కూర్చుని పరిష్కరించుకోవాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు చెబుతున్నట్లు కూటమి ఐక్యత చెదరకుండా ముందుకు సాగాలని కోరారు. నియోజకవర్గంలో సుమారు 125 గ్రామాలు ఉన్నాయని, క్షేత్రస్థాయిలో పోటీ ఆసక్తి వల్ల కొంత టెన్షన్ సహజమేనన్నారు. అయితే అభ్యర్థులు తాము గెలుస్తామా లేదా అనే అంశాన్ని వాస్తవికంగా అంచనా వేసుకోవాలని, తగ్గిన వారికి భవిష్యత్తులో నామినేటెడ్ పదవుల రూపంలో అవకాశాలు వస్తాయని చెప్పారు. పదవుల ఆశించడం తప్పుకాకపోయినా, ముందు పార్టీ గెలవడం ప్రధానమని, పార్టీ అధికారంలో ఉండి గెలిస్తేనే పదవులు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం ఉందని, అదే స్ఫూర్తితో పంచాయతీ ఎన్నికల్లోనూ 95 శాతం స్ట్రైక్ రేట్ సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు రౌతు కాము నాయుడు, ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, దన్నాన రామచంద్రుడు పాల్గొన్నారు.

రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా