BREAKING
48 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆర్. పీ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాభివృద్ధికి బాటలు వేస్తా పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ మలయనూరులో టిడిపి ప్రచార రథం పై దాడి. ధ్వంసమైన బొలెరో వాహనం. సమన్వయంతో పనిచేస్తే గెలుపు: కిమిడి కళా వెంకట రావు సర్పంచ్ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు..సామగ్రిని సిద్ధం చేస్తున్న సిబ్బంది మున్సిపల్ వైస్ చైర్మన్ గా పప్పల మోహన్ కొలువు దీరిన పాలకొండ నగర పంచాయతీ పాలకవర్గం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన పోటీల విజేతలు పార్వతీపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత బాలభూపాల నాయుడు.. డిసెంబర్ 1, 2,3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి.... సిఐటియు పిలుపు. కార్పొరేషన్ ఎన్నికల్లో పచ్చ నోట్ల పందేరం..! ఆమదాలవలసలో టిడిపి ముమ్మర ప్రచారం

పార్వతీపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

Select Suryaa Now
పార్వతీపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

పార్వతీపురం, నవంబర్ 23:మేజర్ న్యూస్ :
పార్వతీపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ప్రిసైడింగ్ అధికారి కె. హేమలత అధ్యక్షతన, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమక్షంలో మున్సిపల్ కార్యాలయం మొదటి అంతస్తులోని కౌన్సిల్ హాల్‌లో ఈ ప్రత్యేక సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. రామగోపాల్ నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికైన బెలగాం కరుణతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పురపాలక సంఘ పరిధిలోని 36 వార్డులకు చెందిన కౌన్సిలర్లతో నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన వలిరెడ్డి పార్వతికి, నూతన చైర్‌పర్సన్ బెలగాం కరుణతో పాటు కౌన్సిలర్లకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శుభాకాంక్షలు తెలిపారు. నూతన పాలకవర్గం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, పార్వతీపురం పట్టణ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.పట్టణంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుధ్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించాలని నూతన పాలకవర్గానికి సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, నూతన కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.