ఆమదాలవలసలో టిడిపి ముమ్మర ప్రచారం
-చైర్ పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల ఎన్నికల ప్రచారం
ఆమదాలవలస, నవంబర్ 23, మేజర్ న్యూస్
అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని టిడిపి చైర్ పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల అన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీలో 19, 3 వార్డులలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. 19వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా తమ్మినేని గీత, 3వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా తమ్మినేని అనురాధ కూటమి బలపరిచిన అభ్యర్థులను మెజార్టీతో గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వార్డుల్లో అభివృద్ధి జరిగిందని, మరింత అభివృద్ధి జరిగేందుకు అవకాశం కల్పించాలని కోరారు. వార్డులోని ప్రజలను, స్థానికులను కలుసుకుంటూ వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలను ప్రజలతో చర్చించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్, తమ్మినేని అన్నం నాయుడు, బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కనితి విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.