డిసెంబర్ 1, 2,3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి.... సిఐటియు పిలుపు.
సీతానగరం నవంబర్ 23 మేజర్ న్యూస్.మండలంలో డంపింగ్ యార్డ్ నందు జరిగిన సిఐటియు విస్తృత సమావేశంలో మండల కార్యదర్శి జి వెంకటరమణ మాట్లాడుతూ..
కార్మికులకు నష్టదాయకంగా ఉన్న నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని, స్కీం వర్కర్లను పర్మినెంట్ చేయాలి, కనీస వేతనం నెలకు రూ,42వేలు,పెన్షన్ తో పాటు రూ,21000 చెల్లించాలి. ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ ఆపాలి, ఖాళీగా ఉన్నపోస్టులను భర్తీ చేయాలి. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేసి సామాజిక భద్రత కల్పించాలి. నీరు, భూమి, అడవి పై ప్రజలకు హక్కులు కల్పించాలని తదితర డిమాండ్లతో ఢిల్లీలో జరుగు కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జై గౌరీ, ఎస్,సింహాచలం, పి. తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు