కార్పొరేషన్ ఎన్నికల్లో పచ్చ నోట్ల పందేరం..!
-- వార్డుల్లో విచ్చలవిడిగా పంపకాలు...
-- కొన్ని వార్డుల్లో ఓటుకు రూ. 5000 చొప్పున చెల్లింపులు
-- కానరానీ ఎన్నికల వ్యయ నియంత్రణ సిబ్బంది..?
శ్రీకాకుళం -మేజర్ న్యూస్:
ఈనెల 26వ తేదీన పోలింగ్ జరగనున్న శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికలు వేడి నగరంలో ఈ చిన్న గల్లీలో చూసిన సెగలు కక్కుతోంది. నరంలో 60 డివిజన్లో ఉండగా మొత్తం 1,57,545 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 77,535 మంది పురుష ఓటర్లు కాగా 79985 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతరులు 25 మంది. 60 డివిజన్లకు గాను కుశలపురం డివిజన్లో కార్పొరేషన్ లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఎన్నికల బరిలో నిలబడిన వారందరూ ముకుముడిగా నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 59 డివిజన్లో మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో సానుభూతి ఓట్లతో విజయాన్ని చేజిక్కించుకోవచ్చు అన్న ఆశతో ఒక వర్గం ఉండగా మరో వర్గం నగరంలో జరుగుతున్న అభివృద్ధి అన్న కోణాల్లో తమకే అధికార పీఠం దక్కుతుందన్న ఆలోచనతో ఉన్నారు. వారసి రెండు వర్గాలు అధికార పీఠం తమదంటే తమదేనని ఎవరి శిబిరాల్లో వారు జోరుగా, ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితిలో ఇందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. గెలుపును చేజిక్కించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలను ఎవరికి వారే చేసుకుంటూ పోతున్నారు. ఇందుకు కుల రాజకీయాలను రెచ్చగొట్టి ద్వేష భావాన్ని ప్రజల్లో సృష్టించే ప్రయత్నాలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ రాజకీయ అనైతిక పోకడలో ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయి అన్న విషయాన్ని పక్కన పెడితే నిన్న మొన్నటి వరకు పక్కింట్లో వ్యక్తుల ముఖాలు కూడా తెలియని వారు నేడు శ్రీకాకుళం నగరంలో ఎయిర్‌పోర్టు కడతామని, బీచ్ నిర్మిస్తామన్న తరహాలో ఆచరణ సాధ్యం కానీ వాగ్దానాలు చేస్తుండడం వారి పదవీ కాంక్షకు, అవగాహన రహిత్యానికి అద్దం పడుతోందని నగర ప్రజలు వ్యంగ్యంగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
విచ్చలవిడిగా నగదు, కానుకలు పంపిణీ:
ఇచ్చిన హామీలు నగరంలో అభివృద్ధికి ఎంతవరకు సహకరిస్తారని తమ గెలుపు కోసం ఎవరికి వారే పోటీలు బడి క్షేత్రస్థాయిలో వెచ్చలవిడిగా నగదు, కానుకలను ఓటర్ల సంఖ్య ఆధారంగా పంపకాలకు పాల్పడుతున్నారు అని విశ్వసనియవర్గాల బోగట్టా. ఓటుకు కనీసం రూ. వెయ్య నుండి 5000 వరకు కొన్ని డివిజన్లో పంపకాలు జరుగుతున్నాయంటే ఎన్నికల వేడి ఎంతలా ఉందో ఊహించుకోవచ్చు. వాటర్ ల సంఖ్య ఎక్కువగా ఉన్న కుటుంబాలకు నగదు తో పాటు వెండి, బంగారు ఆభరణాలు, టీవీ, ఫ్రిడ్జ్ వంటి ఇతర కానుకలను కూడా అదనంగా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలింగ్‌కు మరో మూడు రోజులు వ్యాధి ఉన్న నేపథ్యంలో ఈ పంపకాల తీవ్రత మరింత జోరందుకునే అవకాశం ఉంది. పంపకాల్లో ఇరువర్గాలు ఒకరికి ఒకరు పోటీ పడుతూ పంపకాల పర్వానికి శ్రీకారం చుట్టడంతో అభ్యర్థుల ఎన్నికల వ్యయం ఒక్కో డివిజన్ కు రూ. 20 లక్షలు లోపు ఉండదని స్థానిక ప్రజానీకం అభిప్రాయంగా ఉంది. ఇంతలా ఎన్నికలకు ఖర్చు చేసిన వారు ఎన్నికల తరువాత ఏ విధంగా నగర అభివృద్ధికి తోడ్పడతారు అన్నది కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా వ్యయ పరిశీలకులు నగరంలో నగదు పంపిణీ పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సగటు ఓటరు మనోగతంగా ఉంది.