BREAKING
48 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆర్. పీ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాభివృద్ధికి బాటలు వేస్తా పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ మలయనూరులో టిడిపి ప్రచార రథం పై దాడి. ధ్వంసమైన బొలెరో వాహనం. సమన్వయంతో పనిచేస్తే గెలుపు: కిమిడి కళా వెంకట రావు సర్పంచ్ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు..సామగ్రిని సిద్ధం చేస్తున్న సిబ్బంది మున్సిపల్ వైస్ చైర్మన్ గా పప్పల మోహన్ కొలువు దీరిన పాలకొండ నగర పంచాయతీ పాలకవర్గం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన పోటీల విజేతలు పార్వతీపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత బాలభూపాల నాయుడు.. డిసెంబర్ 1, 2,3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి.... సిఐటియు పిలుపు. కార్పొరేషన్ ఎన్నికల్లో పచ్చ నోట్ల పందేరం..! ఆమదాలవలసలో టిడిపి ముమ్మర ప్రచారం

సర్పంచ్ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు..సామగ్రిని సిద్ధం చేస్తున్న సిబ్బంది

Select Suryaa Now
సర్పంచ్ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు..సామగ్రిని సిద్ధం చేస్తున్న సిబ్బంది

గరుగుబిల్లి, నవంబర్ 23, మేజర్ న్యూస్:గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు గరుగుబిల్లి మండల పరిషత్ అభివృద్ధి కార్యాల య యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది.ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అవస రమైన పోలింగ్ మెటీరియల్‌ను సిద్ధం చేసే పనిలో అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు.స్థానిక మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి  కార్యాలయంలో పరిపాలనా అధికారి (ఏవో) నాలి అర్జునరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఎన్నికల సామగ్రిని విభజించే పనులను వేగవంతం చేశారు.పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ బాక్సులు, వివిధ రకాల ఫారాలు, స్టేషనరీ మరియు ఇతర ముఖ్యమైన పత్రాలను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా ప్యాక్ చేస్తున్నారు.ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి సామగ్రి పంపిణీ సమయంలో ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏవో నాలి అర్జునరావు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయ తీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధిం చి పకడ్బందీ చర్యలు తీసుకుంటు న్నట్లు కార్యాలయ ఏవో నాలి అర్జున రావు పేర్కొన్నారు.మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు సకాలంలో సామాగ్రి ని చేరవేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు.ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ప్రతి అంశాన్ని ఏవో అర్జునరావు దగ్గరుండి పరిశీలిస్తూ సిబ్బందికి తగు సూచనలు సలహాలను అందజేస్తున్నారు.మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ సిబ్బంది బెంకిలి శ్రీనివాసరావు ఎన్ కులశేఖర్, గుంట్రేడ్డి కృష్ణప్రసాద్, డాకోజు సూర్య ప్రభాకర్ తదితర సిబ్బంది మెటీరియల్ ను సిద్ధం చేస్తున్నారు.