BREAKING
48 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆర్. పీ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాభివృద్ధికి బాటలు వేస్తా పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ మలయనూరులో టిడిపి ప్రచార రథం పై దాడి. ధ్వంసమైన బొలెరో వాహనం. సమన్వయంతో పనిచేస్తే గెలుపు: కిమిడి కళా వెంకట రావు సర్పంచ్ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు..సామగ్రిని సిద్ధం చేస్తున్న సిబ్బంది మున్సిపల్ వైస్ చైర్మన్ గా పప్పల మోహన్ కొలువు దీరిన పాలకొండ నగర పంచాయతీ పాలకవర్గం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన పోటీల విజేతలు పార్వతీపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత బాలభూపాల నాయుడు.. డిసెంబర్ 1, 2,3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి.... సిఐటియు పిలుపు. కార్పొరేషన్ ఎన్నికల్లో పచ్చ నోట్ల పందేరం..! ఆమదాలవలసలో టిడిపి ముమ్మర ప్రచారం

కొలువు దీరిన పాలకొండ నగర పంచాయతీ పాలకవర్గం

Select Suryaa Now
కొలువు దీరిన పాలకొండ నగర పంచాయతీ పాలకవర్గం

 పాలకొండ, మేజర్ న్యూస్ 
పాలకొండ నగర పంచాయతీ పాలకవర్గం సభ్యులు ప్రమాణస్వీకారం సోమవారం అట్టహసం సాగింది. నగర పంచాయతీ ఆవరణలో వేదిక ఏర్పాటు చేయడంతోపాటు, చేపల మార్కెట్ ఎదురుగా స్థానికులు వీక్షించేందుకు ఎలఈడి వాల్‌ను ఏర్పాటు చేశారు. ముందుగా నగర పంచాయతీ చైర్మన్ పల్లా విజయనిర్మల ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం కౌన్సిలర్లు ఒక్కొక్కరిగా వేదికపై వచ్చి.. ప్రమాణస్వీకారం చేశారు. కౌన్సిలర్లలో విద్యావంతులు, యువకులు, అనుభవం కలిగిన కౌన్సిలర్లు ప్రమాణస్వీకార పత్రాన్ని చదవటంతోపాటు, వారికి నచ్చిన స్టైల్‌లో ప్రతిజ్ఞ చేశారు. కొంత మంది కౌన్సిలర్లు కొద్దిగా ఇబ్బందికి గురికావడంతో కమిషనర్ నూకరాజు వారితో చదివించి, ప్రతిజ్ఞ చేయించారు. కొంత మంది కౌన్సిలర్లు భావద్వేగంతో  ప్రతిజ్ఞ పూనారు. కౌన్సిలర్లు కోలా లక్ష్మీ ప్రతిజ్ఞ చేస్తూ... తన భర్త దివంగత నేత కోలా మూర్తిని జ్ఞాపకం చేసుకుంటూ.. ఏడ్చేసింది. అనంతరం వేదికపై ఉన్న పెద్దలు ఆశ్వీరాదం స్వీకరించారు. కౌన్సిలర్లు ప్రతిజ్ఞ అనంతరం చైర్మన్ దంపతులతోపాటు, ఎమ్మెల్సీ గ్రీష్మా, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, టీడీపీ ఇన్‌చార్జ్ పడాల భూదేవీలు సత్కరించారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నమ్మకం, మాపై విశ్వాసంతో నగర పంచాయతీ ప్రజలు భారీ మెజార్టీని ఇచ్చారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ కలిసికట్టుగా నెరవేర్చుతామన్నారు. ప్రధానంగా సెంట్రల్ లైటింగ్, ఇంటింటికి కొళాయిలు వంటి ప్రధాన హామీలను అతి త్వరలోనే నెరవేరస్తామన్నారు. ఎమ్మెల్సీ గ్రీష్మా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ఇంత పెద్ద విజయాన్ని అందించిన నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నగర పంచాయతీ సమావేశ మందిరంలో వైస్ చైర్మన్ ఎంపిక రహస్యంగా జరిగింది. జర్నలిస్టులకు ప్రవేశం లేకుండా నాలుగు గదు ల మధ్యలో ఎంపిక జరపటంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. బహిరంగ గా నగర పంచాయతీ కమిషనర్ నూకరాజు జర్నలిస్టులకు ఎంట్రీ లేదని ప్రకటించారు. కేవలం కౌన్సిలర్లకు మాత్రం ప్రవేశమని చెప్పి.. కావాల్సిన వారికి గేటులు తెరిచారు. ఈ ఘటనపై సర్వత్ర అనుమానులు వ్యక్తమయ్యాయి. ఎంతో ప్రతిష్టకమైన వైస్ చైర్మన్ ఎంపిక జరగటంపై సర్వత్ర ఉత్కంఠ నడిచింది.  స్వయంగా జర్నలిస్టులను అడ్డుకోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు.అనంతరం స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయ కృష్ణ, ఎమ్మెల్సీ గ్రీష్మ కలుగ జేసుకొని నచ్చి చెప్పే ప్రయత్నం చేశారు.