అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన పోటీల విజేతలు
అభినందించిన జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి,
పార్వతీపురం, నవంబర్ 23, మేజర్ న్యూస్ :
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ పోటీలలో విజేతలుగా నిలిచిన సిబ్బందికి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, చేతుల మీదుగా నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా జీవించగలుగుతున్నారని పేర్కొన్నారు. అమరవీరుల సేవలు, త్యాగాలను భావితరాలకు తెలియజేయడం, పోలీస్ శాఖ పట్ల గౌరవం, సానుకూల దృక్పథం పెంపొందించడం ఈ సంస్మరణ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పోటీలలో పాల్గొన్న సిబ్బంది తమ ఆలోచనలను, ప్రతిభను చక్కగా వ్యక్తీకరించడం అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలు పోలీస్ సిబ్బందిలో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, వృత్తిపట్ల నిబద్ధతను పెంపొందిస్తాయని ఎస్పీ పేర్కొన్నారు. వ్యాసరచన, వకృత్వ పోటీలలో మొదటి బహుమతిగా రూ.5,000, రెండవ బహుమతిగా రూ.3,000, మూడవ బహుమతిగా రూ.2,000 చొప్పున నగదు బహుమతులను అందజేసి, విజేతలకు ప్రశంసా పత్రాలను అందించారు.
పోటీల విజేతలు :
1. జె. ఝాన్సీ, డబ్ల్యూ పి సి -599, పాలకొండ పోలీస్ స్టేషన్ – మొదటి బహుమతి.
2. పి. ఉదయ్ భాస్కర్ బాబు, పి సి -271, సి సి ఎస్ – రెండవ బహుమతి.
3. ఎస్. చిరంజీవి, ఎ ఆర్ పి సి -1971, డి ఎ ఆర్ – మూడవ బహుమతి.
వకృత్వ పోటీల విజేతలు :
1. ఎం. హరి కృష్ణ, పి సి -338, మహిళా పోలీస్ స్టేషన్ – మొదటి బహుమతి.
2. పి. లావణ్య, డబ్ల్యూ హెచ్ సి -260, మహిళా పోలీస్ స్టేషన్ – రెండవ బహుమతి.
3. ఎం. శివ కృష్ణ, పి సి -495, పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ – మూడవ బహుమతి.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఎస్బీ సీఐ రమణమూర్తి, డీసీఆర్బీ సీఐ వెంకటరమణ, ఏఆర్ ఆర్ఐలు నాయుడు, రాంబాబు, ఆదినారాయణ సిబ్బంది* పాల్గొన్నారు.