పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు
గరుగుబిల్లి, నవంబర్ 23, మేజర్ న్యూస్:గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా,పారదర్శకంగా నిర్వహిం చేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.ఇందులో భాగంగా సోమవారం డిప్యూటీ ఎంపీ డీవో మరడాన వెంకటేశ్వరరావు, మండల వెలుగు ఏపీఎం పెదిరెడ్ల అప్పలనాయుడులు మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఎన్నికల సంఘం నిబం ధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగ కుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు వారు సూచించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ సరఫరా మరియు ఫర్నిచర్ అందుబాటులో ఉన్నాయో లేదో పరిశీ లించారు.దివ్యాంగులు,వృద్ధులు సులభంగా ఓటు వేసేందుకు వీలుగా ర్యాంప్‌ల నిర్మాణాన్ని తనిఖీ చేశారు. కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, బారికే డింగ్ మరియు పోలింగ్ సిబ్బందికి అవసరమైన వసతులపై పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు జారీ చేశారు.ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది బాధ్యతా యుతంగా వ్యవహ రించాలని, ఎక్కడైనా చిన్నపాటి లోపాలు ఉన్నా వెంటనే సరిదిద్దాలని డిప్యూటీ ఎంపీడీవో మరడాన వెంకటే శ్వరరావు, ఏపీఎం పెదిరెడ్ల అప్పల నాయుడులు పేర్కొన్నారు.గ్రామ పంచాయతీ ఎన్నిక లను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాం గం ముమ్మర ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నా రు.ఆయా గ్రామాల్లోని పాఠశాలలు, పంచాయతీ భవనాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించిన డిప్యూటీ ఎంపీడీవో మరడాన వెంకటే శ్వరరావు, మండల వెలుగు ఏపిఎం పెదిరెడ్ల అప్పలనాయుడులు అక్కడ కల్పించిన మౌలిక వసతులపై ఆరా తీశారు.ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద బ్యాలెట్ బాక్సుల భద్రత వంటి అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్థానిక సిబ్బందికి సూచించారు.ఓటర్లు ఎటు వంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో స్థానిక పంచాయతీ కార్యదర్శులు,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.